నీలో సగమై

కన్నుల ఎదుట నువ్వున్నా
మాటలు రాని మౌనిని నేను
నువ్వు మాట్లాడుతున్నా
సమాధానం చెప్పని ప్రశ్నను నేను
నా యదలో ఎన్నో ప్రశ్నలు ఉన్నా
ఎదురుచెప్పని అభిమానిని నేను
నీ రూప లావణ్యాన్ని వర్ణించలేని కవిని నేను
నా ప్రేమని వ్యక్తపరచానికి ఆశక్తురాలిని నేను
నా కళ్ళల్లో ఆనందం ఉందో లేదో చెప్పే వాడివి నువ్వు
నా నడక చూసి ఏదో జరిగిందనీ తెలుసుకునే వాడివి నువ్వు
ఎంతదూరంగా ఉన్నా మాటల్లో పెట్టీ మాయ చేసేవాడివి నువ్వు
మనసు లోతుల్లోకి చూసి నవ్వించి వాడివి నువ్వు
నా ఎద గాయాలను చల్లార్చే మంచు బిందువు నువ్వు
మనసులో ఏముందో కనిపెట్టి కవ్వించేవాడివి నువ్వు
ఇంత అందమైన జీవితంలో నీ పరిచయం ఒక వరం నాకు
జీవితంలో తోడుగా ఉంటామో తెలీదు కానీ
జీవితాంతం నీ ఎద లోతుల్లో దాక్కోవాలనే నా తపనంత
నీలో సగమై, నీలో లీనమవ్వలనే నా కోరిక మన్నిస్తావా ప్రియా..

-భవ్య చారు

image