కన్నుల్లో నీ రూపం ,యదలో ప్రేమ ,కనిపించని భావాలెన్నో నీతో పంచుకోవాలని,నీలో సగమై,నాలో భాగమై ,ఇరువురం ఒక్కటై ,ప్రేమకొక రూపాన్ని ఇవ్వాలని,ఎదలోని భారాన్నంతా దించుకోవాలని,ఎన్నో ఏళ్లుగా నీ కోసం నిరీక్షిస్తూ ఇన్నాళ్లకైనా కరుణిస్తావా? నా మనసుని పంచుకుంటావా ప్రియా, ఇకనైనా ఈ మౌన ప్రేమను మరిచి,నీతో జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని నాకిస్తావా ,గుండెల్లో పెట్టుకున్న నిన్ను నా జీవితభాగస్వామివి అవుతావా ప్రియా...నా జీవితంలో చిరుదివ్వెను వెలిగిస్తావనే ఆశతో ఇదే నా విన్నపం ....భవ్యర్చన

image