హృదయం కోల్పోయిన పూవుల్లో ప్రేమయా,,,,,,,!?!

హృదయం లోతుల్లోంచి ఉప్పొంగే
ప్రఘాడమైన మకరందాల ఊట ప్రేమ,,,,,,,,,,
ప్రేయసి భౌతిక అందం బదులు హృదయం
వెన్నెల జల్లులు కురిపించే జాబిలి ఆహ్లాదం
ఆమెలో గమనించి ఆరాధించే
మేఘశ్యాముడు ప్రియుడు,,,,,,,
ఇతరుల శారీరక సౌందర్యం గుండెల్లో
గుబులు రేపితే ప్రేమగా బ్రమసి బ్రతుకు వెర్రితలలు
వేయునది ప్రేమెలా అవుతుంది మీ పిచ్చిగాని,,,,,,,
కామం నిండిన కళ్ళు అంధకార బంధురం హృదయం ఏమాత్రం ప్రేమను అందించలేదు కనిపించిన పూవులన్నీ నలిపేయాలనే
కోరికల కాముఖులు నరకతుల్యం జీవితాలు,,,,,,,
యువతీయువకులు చదువులు దూరం చేసుకుని పగటికలల రేపే సినిమాల్లోలా పగుళ్ళుదేరిన సౌందర్యం ఆకర్షణలో
అదే ప్రేమగా బ్రమసి భవిష్యత్తు నరకతుల్యం
చేసుకుని జీవితాంతం విలపించినా కాలం తిరిగిరానిది
నీ జీవితాన్ని శాసిస్తూ పరుగులు తీస్తుంది,,,,,,
మేకప్పుల మెరుగుల తళుకుబెలుకుల శరీరాల్లో
ప్రేమను భూతద్దం పెట్టి వెతికినా ఆగుపించని
కామపిశాచాలు అల్లుకునే నేటి నవీనతరం
కృత్రిమ రంగుల ప్రేమ ప్లాష్టిక్ పూవులు,,,,,,,,

-అపరాజిత్
సూర్యాపేట

image