ఈ రోజు అంశం
మీ పిల్లలు తప్పు చేస్తే మీరేం చేస్తారు

శీర్షిక
సరిదిద్దే ప్రయత్నం చెయ్యాలి.

పిల్లలు తప్పు చేస్తే వారిని సరిదిద్దే ప్రయత్నం చెయ్యాలి.
వారికి సరైన మార్గదర్శకత్వం చెయ్యాలి. నేను నా ఇద్దరు
పిల్లలను ఇప్పటివరకు దండించలేదు. నా అబ్బాయి
చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం చేస్తున్నాడు. వాడిని
నేనెప్పుడూ కొట్టలేదు. అలాగే
నా అమ్మాయి తొమ్మిదవ తరగతి చదువుతోంది. నేను
నా అమ్మాయిని కూడా ఎప్పుడూ కొట్టలేదు. చెప్పే
విధానంలో చెప్పితే వింటారు
అని నా నమ్మకం. వారిద్దరూ
తప్పులు చెయ్యలేదని కాదు.
చాలా తప్పులే చేసారు. ఆ
తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం వారే చేసారు.
సక్సెస్ సాధిస్తూ ఉన్నారు.
నా మాటే శాసనం అంటే
పిల్లలు వినరు. ఇలా చేస్తే
నీకు మంచిది అని చెప్తే
పిల్లలు వింటారు. చెప్పి
చూడండి. మీ పిల్లలు మంచి ఫలితాలు సాధించవచ్చు.

ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని