ఈ రోజు అంశం
విలువ

శీర్షిక
జీవితం చాలా విలువైనది.

జీవితం చాలా విలువైనది. ఆ
విషయం తెలిసినా కూడా చాలా మంది వ్యసనాలకు
బానిసలై తమ జీవితాన్ని
నాశనం చేసుకుంటున్నారు.
తెలిసీ తెలియని వయసులో
చేస్తే అర్ధం చేసుకోవచ్చు కానీ
అన్నీ తెలిసిన వయసులో
చేస్తే స్వయంకృతాపరాధం
అవుతుంది. సమయాన్ని
వృధా చేయకుండా ఉన్న
సమయాన్ని సద్వినియోగం
చేసుకోవాలి. డబ్బు చాలా
విలువైనదే కానీ అంతకంటే
ఎక్కువ విలువైనది సమయం.
ఎక్కువ కాలం జీవించాలనే
వారు ప్రశాంతంగా ఉండాలి.
అతిగా ఆరాటపడి ఏదీ
సాధించలేకపోతే ఇబ్బందిగా
అనిపిస్తుంది. అప్పుడు
వ్యసనాలకు బానిస
అయ్యి ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైతే ఆయివు తగ్గి
పోతుంది. సమయం, డబ్బు సద్వినియోగం చేసుకున్న
వారే గొప్ప స్ధాయికి చేసుకోగలరు.


ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని