ఆకలి,,, ఆకలి,,, మండే ఆకలి,, ఈ కాళరాత్రి లోకాలన్నీ గాలింపిస్తూ,,,,,కటిక ఆకలి,,,,,,,!

ఆకలి పేగుల డొక్క పీకుతూ
కళ్ళల్లోని రక్తకేషణాళికలన్నీ ఎండిపోయి
కనుపాపలు రక్తసముద్రాలు కుంచించుకుని పోయి
గుండె లయలు చెవులకు వినిపిస్తున్న తుదిశ్వాసా సంకేతాలు
ఆకాశంలో ఆకలి రక్త పిశాచాల సోమాలియా డేగలు ఎగురుతున్న చప్పుడు,,,,,
నా ఊపిరిగుండె చప్పుడులో తన ఆకలి పోరుకు నేనొక విందులా అగుపించే నా ముందు వాలిన డేగ కళ్ళు సూదంటు రాళ్ళు,,,, ,,,,
ఆ రాబందు నా చివరి చూపుల్లో నా కళ్ళల్లోంచి తేలిపోయే ఊపిరుల కీలలను గమనిస్తూ ఎగబడి నా బక్కచిక్కిన ఎముకల దేహాన్ని పీక్కుతినేందుకు ఆవురావురంటూ ఎదురుచూస్తూన్న ఈ ఆకలి దేశం ఆఖరి శ్వాసల దేహాల ఎముకల దిబ్బను,,,,,,,,,
ఆ రాబంధు కళ్ళ తీక్షణ నిరీక్షణ చూపులు నన్ను ఖండఖండాలు చేసే ఖడ్గాల్లా నా ప్రాణాల ఆఖరి ఎగశ్వాస దిగశ్వాసాలను నీ ఆకలి తీర్చే వృత్తి పరిరక్షణకై ఫోటో చిత్రీకరణ బహు వేదనాభరితం సుమీ పూటుగా తిని బ్రేవ్ మనేందుకు ఓ ఆకలి కేకల సోమాలియా చివరి క్షణాలకై ఎదురుచూస్తున్న ఆకలి ఎముకల గూళ్ల రాబంధుల్లో మనిషి కళ్ళు ఇంకా పదునైన వేటకొడవళ్ళు ఆ డేగల సాక్షిగా ఆఖరి ఆకలి కోరలు,,,,,,,!!




-అపరాజిత్
సూర్యాపేట

image