బిడ్డ, కరెంటు పని చేసినప్పుడు జాగ్రత్త.
కరెంటు షాక్ కొట్టి బాలిక మృతి అనే వార్త చదివాను.
బిడ్డ, గొలుసు వేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త.
మెడలో గొలుసు లాకున్న దొంగలు అనే వార్త చూసాను.
బిడ్డ, సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టేటప్పుడు జాగ్రత్త.
అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసినట్టు విన్నాను.
బిడ్డ, కాలేజిలో మగ టీచర్లతో జాగ్రత్త.
లైంగిక వేదింపులు చేసిన టీచర్ అనే వార్త చదివాను.
బిడ్డ, ఎటైనా ఒంటరిగా వెళ్ళేటప్పుడు జాగ్రత్త.
అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు అనే వార్త విన్నాను.
బిడ్డ, ఇన్ని జాగ్రత్తలు చెప్పిన నాన్నతో జాగ్రత్త.
కూతురిని చంపేసిన తండ్రి అనే వార్త విన్నాను.
బిడ్డ, నీకు భద్రత ఇవ్వాల్సిన మనుషులే,
నిన్ను బానిసను చేస్తారు, నీ బ్రతుకును కుల్చేస్తారు జాగ్రత్త.
Aksharalipi Admin
حذف التعليق
هل أنت متاكد من حذف هذا التعليق ؟