అనుకోలేదు ఇలా, నా భావాలని ఒకరితో పంచుకోడానికి లేక, ఇలా నా డైరీలో రాసుకుంటానని..
అనుకోలేదు ఏనాడు, అందాల సందడిలో సవ్విడి చేస్తూ లోకం మునుగుతుందని..
అనుకోలేదు ఏ మాత్రం, మంచి మనసుకి ఎప్పుడు బాధే కలిగిస్తారని..
అనుకోలేదు ఊహల్లో కూడా, స్వేచ్చగా తిరగాల్సిన పక్షి రెక్కలు విరిచేస్తారని..
అనుకోలేదు అసలు, మన కష్టాల్లో తోడు ఉండాల్సిన వాళ్ళు కనుమరుగైపోతారని..
అనుకోలేదు అలా, నిజాన్ని ప్రశ్నించే గొంతుని నులిమేస్తారని..
అనుకోలేదు ఎప్పటికీ, నా అనుకున్న వాళ్ళే నా మీద నమ్మకం కోల్పోతారని..
అనుకోలేదు కొంచం కూడా, సహాయం చేసే చెయ్యిని మర్చిపోయి, వెన్నుపోటు పొడుస్తారని..
అనుకోలేదు ఏనాడు, ప్రశాంతంగా గడపాల్సిన జీవితాన్ని కూల్చేస్తారని..
అనుకోలేదు ఇలా, మంచి కోరే మనిషిని నలుగురిలో నవ్వులపాలు చేస్తారని..
అనుకోలేదు నా అనుకున్న వాళ్ళందరూ దూరం అవుతారని..
అనుకోలేదు అసలు, అన్నిటినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతానని..
నటిస్తూ, నవ్వుతూ బ్రతుకుతున్న నేను,
జీవిత పరమార్థం తెలుసుకున్న, జీవితాన్నీ పరిపూర్ణం చెయ్యలేను 💔