మేల్కొలుపు సంగీతం,,,,!!

జుమ్మని ప్రసరించే పసిడి కాంతులు
ఉదయ సంధ్యలో వెల్లువలై సాగే కాంతి పుంజాల నును వెచ్చని కమ్మని సన్నని మేల్కొలుపు వయోలిన్ సంగీతంలా శోభిల్లు అవనీ తనయుల కళ్ళల్లో సుందర చిత్రం,,,,,,,,,
ఈ భువిపై లేతఎరుపు పసుపు వన్నెలద్దుకున్న కొండాకోన తొలి సంధ్యాకాంతుల్లో సూరీడు పాడే ప్రభాత చైతన్య శ్రావ్య గీతాల్లో మట్టిబెడ్డల కొండలు సైతం వెలుగుల సౌందర్య రూపసులు ఇంద్రలోకమాయె ఈ అవని తడిసిన ముగ్దయై సూరీడు సన్నని కాంతులలో,,,,,,,,
వేకువజామున ముసురుకోస్తున్న కమనీయ దృశ్యం కర్షకులు కార్మికులు శ్రామికులు శ్రమల ఆరంభంలో ఇల్లాళ్ళు ఇళ్ళ ముందు తీర్చే రంగవళ్ళుల్లో జగతి కళ్ళకు అద్భుత చిత్రం దిగంతాల కావల రవి ఉషస్సులో పరవశించిన ప్రకృతి కన్యక సౌందర్యం మేల్కొని గాంచవోయ్ అవనీ తనయుడా
ఈ అవని లేత ఎరుపు పసుపు రంగులు కలిపిన మనోహర పుష్పం కవుల కల్పనల్లో ఓ సౌందర్య ఆరాధకుడా మేల్కోవోయ్,,,,,,,,




-అపరాజిత్
సూర్యాపేట

image