ఆనందో బ్రహ్మ
ఆనందాన్ని మనమే అందిపుచ్చుకోవాలి.
అది ఎవరూ ఇచ్చేది కాదు..
పొద్దున్నే లేచి ప్రకృతిని ఆస్వాదిస్తూ కమ్మటి కాఫీ తాగితే
అదే అనందో బ్రహ్మ
మంచి ముద్ద పప్పులో నెయ్యి వేసుకుని
ఆవకాయ పిండి నంచుకుని తింటే
అదే అనందో బ్రహ్మ
నలుగురితో కలిసి ఆనందం పంచుకుంటూ ఉంటే
అదే ఆనందో బ్రహ్మ
మంచి పుస్తకాలు చదువుతూ
ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచుతుంటే
అదే ఆనందో బ్రహ్మ
మంచి ఫీల్ గుడ్ సినిమా చూసి
దాని గురించి అందరికీ చెప్తుంటే
అదే ఆనందో బ్రహ్మ
తనివి తీరా నవ్వుతూ అందరికీ
ఆ నవ్వులు పంచుకుంటూ ఉంటే
అదే ఆనందో బ్రహ్మ
మా అమ్మాయి పనిచేసే JP Morgan
ఫ్యామిలీ డే కి వెళ్లి అక్కడ గర్వంగా తిరిగాం
అది కూడా ఆనందో బ్రహ్మ
ఆనందం ఏమీ బ్రహ్మ పదార్థం కాదు
మనకి అందుబాటులోనే ఉంటుంది
- రామకూరు ఎల్. మణి