దాంపత్యo
కొంత మంది బ్రహ్మచారులు పెళ్ళి చేసుకోవటానికి ఇష్టం చూపించరు. దానికి కారణం వారు చిన్నతనం నుంచి తమ కుటుంబంలో కానీ తమ చుట్టూ ఉన్న సమాజంలో కానీ దంపతుల మధ్య జరిగే గొడవలు చూసి విసిగిపోయి పెళ్ళి అంటే విముఖత కలిగి ఉంటారు. వాస్తవానికి అలాంటి సంఘటనలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి.
అంత మాత్రాన దంపతులందరూ సుఖంగా లేరని కాదు. ఇలా దంపతుల మధ్య మనస్పర్థలు రావటం సహజమే కానీ వారు మళ్ళీ కలసిపోయి జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొసగని
వాళ్ళు విడిపోతున్నారు. అలా చేయటం కూడా విధాయకమే. భార్యాభర్తలు ఇద్దరి మధ్యన సమన్వయం ఉంటే దాంపత్యం సుఖమయం అవుతుంది.
కాపురం పండాలంటే భార్యాభర్తల మధ్యన సమన్వయం తప్పనిసరి. ముఖ్యంగా మగవారు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. చాలా మంది బ్రహ్మచారులు పెద్ద వయసు వచ్చాక తాము పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది అని అనుకోవటం నేను విన్నాను. పెళ్లి అనేది పవిత్ర బంధం. ఆ బంధాన్ని నిలుపుకోవటం ఆ దంపతుల చేతిలోనే ఉంటుంది. దంపతుల మధ్య ప్రేమ ఉండాలి. ప్రేమ లేని ఏ బంధమయినా నిలబడదు.
- వెంకట భానుప్రసాద్ చలసాని