వీళ్ళ అనుబంధం - మాధవి కాళ్ల

Comments · 231 Views

- మాధవి కాళ్ల వీళ్ళ అనుబంధం - మాధవి కాళ్ల వీళ్ళ అనుబంధం

వీళ్ళ అనుబంధం

"మీరా... ఈరోజు ఏంటి కొత్తగా మా ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నావు స్కూల్ కి" అని అడిగింది గీతిక.
"మనం కొన్ని రోజులు స్కూల్  డుమ్మా కొట్టి చేసిన పనులు ఇంట్లో తెలిసిపోయేయి కదా. అందుకని మా అమ్మ ఈరోజు నుంచి మీ ఇంటి దగ్గర నుంచి స్కూల్ కి వెళ్ళమని వార్నింగ్ ఇచ్చింది" అని చెప్పింది మీరా.
మీరా , గీతిక ఒకే క్లాస్మేట్స్. గీతికా అత్త కూతురు మీరా. ఇద్దరు వయసులో వేరైనా క్లాసులో మాత్రం ఇద్దరు మంచి ఫ్రెండ్స్.
అనుబంధం పెరిగి పెద్దది కూడా అయింది.
మీరా డిగ్రీ పూర్తి చేసి పెళ్లి చేసుకుంది. తన పెళ్లికి కొన్ని కారణాలు వల్ల వెళ్లలేకపోయింది గీతిక.
రెండు కుటుంబాలు దగ్గర వాళ్లే కానీ కుటుంబాలు అన్నాక గొడవలు ఉండవా? గొడవలు సహజమే.
కానీ వీళ్లు స్నేహం మాత్రం రోజు రోజుకి పెరిగి పెద్దది కూడా అయిపోయింది.
పెద్దవాళ్ళు గొడవలు పడినా కూడా వీళ్లు రహస్యంగా ఫోన్ చేసుకుని హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళు.
మీరా మేనమామ కూతురు ఫంక్షన్ కోసం గీతిక వాళ్ళకి , మీరా వాళ్ళకి గొడవలు జరిగాయి.
కానీ మీరా , గీతిక మాత్రం అందరి ముందు మాట్లాడకుండా నటిస్తూ రహస్యంగా ఎవరూ లేనప్పుడు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు.
పేరుకి సొంత కుటుంబాలైనా వీళ్ళు అనుబంధం మాత్రం పర్సనల్ విషయాలు పంచుకునే అంతగా వీరి మధ్య చనువు పెరిగింది.
గీతిక చివరి అత్తయ్య వాళ్ళ కొడుకు పెళ్లికి అనుకోకుండా మీరా వాళ్లు రావడం వల్ల ఆ పెళ్లిలో వీళ్ళు చేసిన సందడికి ఎప్పుడు మర్చిపోలేనివి.
గీతిక , మీరా లు కలిస్తే చాలు ఇంకా సందడే సందడే.
వాళ్ళ అల్లరికి అదుపు ఉండదు. వాళ్ళ మాటల్ని ఆపలేరు అందరితో చాలా ఈజీగా కలిసిపోతారు.
వాళ్ళు ఇద్దరు చదువులో కాస్త తక్కువైనా.
చాలా ఏళ్ల తర్వాత గీతిక వాళ్ళ తాతయ్యకి సీరియస్ గా ఉందని వాళ్ళ అమ్మ నాన్న ఊరు వెళ్లారు. అప్పుడు మీరా ఇంట్లో గీతిక వాళ్ళు ఉన్నారు.
అప్పుడు గడిపిన రోజులు ఇంకెప్పటికీ మరువలేనివి. ఆ తర్వాత మీరాకీ పెళ్లి అయిపోయింది. పెళ్లి తర్వాత తన తాను సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంది.
కొన్ని కారణాలవల్ల గీతిక చెల్లెలికి త్వరగా నిశ్చితార్థ ఏర్పాట్లు చేశారు.
నిశ్చితార్థం ఊర్లో జరగడం వల్ల అందరూ ఊరెళ్ళారు. కానీ గీతిక మాత్రం మీరా వాళ్ల దగ్గర కొన్ని రోజులు ఉంది.
మళ్లీ చాలా రోజులు తర్వాత కలిసి ఆ పది రోజులు గడిపారు వీళ్లు ఇద్దరు. గీతిక మాటల్లో చెప్పలేని జ్ఞాపకాలన్నీ పోగేసుకుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు కలుసుకోవడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి.
వీళ్ళ అనుబంధం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.
పుట్టిన దగ్గర్నుంచి విళ్లు కలుసుకుంటూనే ఉండేవాళ్ళు. ఎవరికోసమో వీళ్ళేందుకు వీడిపోవాలి అని భావనతో రహస్యంగా మాట్లాడుకొని వీళ్ళ అనుబంధాన్ని పెంచుకుంటున్నారు.
ఇప్పుడు మీరాకి ఒక బాబు. గీతిక వాళ్ళ చెల్లికి ఒక బాబు. ఇద్దరి ఇంట్లోనూ పసిపాపల నవ్వులతో సందడిగా ఉంది.
వీళ్ళ అనుబంధం ఎల్లప్పుడు ఇలానే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

- మాధవి కాళ్ల

Comments