జీవిత తిరోగమనం - పార్ట్ 1 - కళ

Comments · 195 Views

జీవిత తిరోగమనం - పార్ట్ 1 - కళ

జీవిత తిరోగమనం - పార్ట్ 1

హలో ఉదయ్...

హ చెప్పు బాబాయ్ బాగున్నావా...
ఉదయ్ నువ్వు ఉన్న పలంగా బయలుదేరి ఊరికి వచ్చేయ్...
ఏంటి బాబాయ్ ఇప్పుడా...! నేను రాలేను బాబాయ్.. నాన్నకు మాట ఇచ్చాను ఎస్. ఎస్. సి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయే వరకూ ఊర్లోకి అడుగు పెట్టను అనీ.. బాబాయ్ అమ్మకు ఏమైనా హెల్త్ బాలేదా బాబాయ్.. అసలు విషయం ఏంటి బాబాయ్...?

ఉదయ్.... ఉదయ్ నాన్న నాన్న....

బాబాయ్.... నాన్న నాన్న అంటున్నారు అసలు విషయం ఏంటో చెప్పండి బాబాయ్ నాకు చాలా కంగారు గా ఉంది...

ఉదయ్ మీ నాన్నకు ఇచ్చిన మాట తప్పి వెంటనే ఊరికి బయలుదేరి రా... బాబాయ్ ప్లీజ్ అసలు విషయం చెప్పండి నాన్నకు ఏమైంది... అంతా బాగున్నారు కదా..

మొన్న నాన్న క్యాంపుకూ వెళ్ళాడు... పొద్దున్న తన పని ముగించుకొని హోటల్ కి వచ్చాడు అట.. నైట్ పడుకున్నవాడు ఇక మళ్ళీ లేవలేదు... నిద్రలోనే మీ నాన్న చనిపోయారు రా...

అసలు ఏం మాట్లాడుతున్నారు బాబాయ్.. నాన్న చనిపోవటమేంటి..? ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు బాబాయ్... మీరు పోరబడి ఉంటారు... బాబాయ్ ప్లీజ్ జోక్ చేయకండి...

రేయ్ జోక్ ఏంటి రా... నిజం! ఇలాంటి విషయాలలో జోక్ ఎందుకు చేస్తా చెప్పు...? విషయం తెలిసినప్పటి నుండి వదిన మంచి నీళ్లు కూడా తాగలేదు... కర్నూల్ నుండి నాన్నను తీసుకోని రావడానికి మీ మావయ్య వాళ్ళు వెళ్లారు.. సాయంత్రానికి ఊరుకి తీసుకొని వస్తారు.. రేపు ఉదయమే అంతిమయాత్ర ఉంటుంది... ఈ లోపు నువ్వు కూడా వచ్చేయ్ ఉదయ్.. ఏ బస్సు ఉంటే దాన్ని పట్టుకొని వచ్చేయ్ రా అని ఏడుస్తూ ఉదయ్ వాళ్ళ బాబాయ్ ఉదయ్ తో చెప్తాడు...

***************

ఉదయ్ ఊర్లోకి అడుగు పెట్టగానే ఊర్లోని జనం అంతా జాలిగా ఉదయ్ వైపు చూసారు... అతి భారంగా పరుగున ఉదయ్ ఇంటికి చేరుకున్నాడు... ఉదయ్ రాగానే ఒక్కసారిగా తన తల్లి ఉదయ్ ను గట్టిగా పట్టుకొని నువ్వైనా ఇది నిజం కాదని చెప్పురా... ఉదయ్... చెప్పు ఇది అంతా అబద్దం అని గట్టిగా రోధిస్తూ తన తల్లీ అక్కడే సృహ కోల్పోతుంది...

పొద్దున్న 8 గంటలకి అంబులెన్సులో తన తండ్రి పార్థివదేహం ఇంటికి చేరడంతో కన్నీటి పర్యంతమై అక్కడి వాతావరణం చాలా విషాదంగా మారుతుంది... తన తండ్రికి తుది వీడ్కోలు పలికి వచ్చిన బంధువులు అంతా తిరుగు పయనం అయ్యారు... 

ఇంట్లో నిశ్శబం. భయంకరమైన నిశ్శబ్దం. తనకు తోడూ నీడగా ఉన్న భర్త అర్ధాంతరంగా తన చేయి వదిలి వెళ్ళాడు అనే ఆవేదన ఉదయ్ తల్లిది. ఇక భవిష్యత్ ముగిసిపోయింది. భరోసా, ధైర్యం అన్నీ తానై నిలిచిన తండ్రి నేడు మౌనంగా గోడకు వేళ్ళాడదీసిన  చిత్ర పటంలో చిరునవ్వుతో చూస్తూ చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు ఉదయ్ కి. ఉదయ్ ఏడుస్తూ ఉంటె తనకి తన తండ్రి గతంలో మాట్లాడిన మాటలు గుర్తుకువస్తాయి. 

"రేయ్ ఉదయ్ బాగా చదువుకోరా.. చదువే ఆసరా, అండరా సీరియస్ గా తీసుకోరా లైఫ్ ను.. ఏ పరిస్థితి ఎలా వస్తుందో తెలీదు.. నేను ఉన్నంత వరకూ నీకూ ఏ లోటు రానివ్వను.. అసలు డబ్బులు అంటే జాగ్రత్తే లేదు నీకు."

రవి, "రేయ్ రామ్ మనము టూర్ ప్లాన్ చేద్దామా...? వద్దు నేనూ ఉదయ్ ఎగ్జామ్స్ ఫీ కట్టాలి. ఉన్న డబ్బులు కాస్త టూర్ కి ఖర్చు పెడితే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది.. నీకూ తెలుసు కదా మా ఇంట్లో పరిస్థితి.. రేయ్ రామ్ దానికి ఎందుకు ఇంత ఆలోచన చేస్తావ్.. టూర్ కి  అయ్యే మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటాలే.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము మనము...

అది కాదు ఉదయ్ మీ నాన్నగారు కూడా ఎగ్జామ్స్ ఫీజ్ కోసమే కదా నీకూ డబ్బులు పంపించారు.. ఆ డబ్బులు కాస్త ఇలా ఖర్చు చేస్తే ఎగ్జామ్స్ ఫీజ్ ఎలా కడుతావు రా..

ఓ అదా ఏముందిరా ఎదో ఒక ఎగ్జామ్స్ వంక చెప్పొచ్చులే... అయినా మాకూ డబ్బు సమస్య మీ అంత లేదు లేరా... నాన్న నాకు డబ్బులు అవసరం అనీ చెప్పిన వెంటనే మరో మాట లేకుండా మా నాన్న నాకు పంపిస్తారు...

కాబట్టి నువ్వేం ఆలోచించక టూర్ ఎలా ఎంజాయ్ చేయాలో ముందు దాని గూర్చి అలోచించి ప్లాన్ చేయి అనీ ఉన్న డబ్బులు మొత్తం దుబారా చేస్తాడు...

- కళ

Comments