సుకుమారం -కోటేశ్వరరావు ఉప్పాల

Komentar · 374 Tampilan

సుకుమారం -కోటేశ్వరరావు ఉప్పాల

సుకుమారం

 

తన రూపం అపురూపం
తన పాదాలు సుతారం
తన పలుకులు ముత్యాల హారం
తను నిద్రిస్తే సుకుమారం
తనని సున్నితంగా మేల్కొల్పమనీ
నేను ప్రకృతికి చేసిన విన్నపం
గంధపు గాలులతో
తనని ముంచుతుందో
పూల జల్లులలో
తనని తడుపుతుందో
అని వేచి చూస్తున్నా.
కురిసే వెన్నెల వర్షం కోసం

 

-కోటేశ్వరరావు ఉప్పాల

Komentar