అందం శాశ్వతం కాదు -సాహు సంధ్య

تبصرے · 280 مناظر

అందం శాశ్వతం కాదు -సాహు సంధ్య

అందం శాశ్వతం కాదు

ఏది అందం...శరీరం పై ఉండే పొర అందమా..!
తెల్లటి,గుండ్రంగా ఉండే మొహం అందమా..!
అందంగా ఉన్న అనే గర్వం అందమా..!
ఎదుటి వాలను చులకన చేసే వ్యక్తిత్వం అందమా..!
పెద్దలను గౌరవించని గుణం అందమా..!
ఇతరులు బాధపడే మాటలు అందమా..!
మట్టిలో కలిసిపోయే శరీరం అందమా..!
ఇతర జీవులను హింసించడం అందమా..!
స్వచ్చమైన,కల్మషం లేని మనసు గలవారు అందం
ఇతర జీవులను ప్రేమించడం అందం
సాటి వారికి సహాయం చేయడం అందం
మంచి మనస్తత్వం కలిగి ఉండడం అందం

 

-సాహు సంధ్య

تبصرے