పూచే పువ్వు

Comments · 221 Views

పూచే పువ్వు ,-మాధవి కాళ్ల

పూచే పువ్వు

ఓ నెలవంక నువ్వు వెళుతూ
సూర్యుడు లేలేత కిరణాలతో వస్తూ
ప్రతిరోజుని పువ్వుల నవ్వుతూ ఆహ్వానిస్తూ
మన జీవితాన్ని చిరునవ్వు చిందిస్తూ ఉండాలని
రాత్రి పగలు ఎలాగో అలాగే మన జీవితంలో వచ్చే సమస్యలు అంతే అని
తెలుసుకొని మసులుకుంటే రేపటి ఉదయాన్నే ఉత్సాహంగా గడుపుతూ ఉంటే
ప్రతిరోజు పూచే పువ్వు సాయంత్రానికి వాడి పోతాను అని బాధపడకుండా
ఆ క్షణంలో ఆ పువ్వు నవ్వాలి అనుకుంటుంది కానీ సాయంత్రం వాడిపోతాను అని బాధ పడదు..
అలాగే ఈ క్షణం ఆనందంగా నవ్వుతూ ఉండాలని తెలియచేస్తుంది..
మనకున్న సమస్యలకు పరిష్కారాలు దొరికే అవకాశాలు ఉన్నా
సరైన రీతులో ఆలోచిస్తున్నామో లేదా ఒక్కసారి తెలుసుకుంటే
కొన్ని సమస్యలు మన తబ్బితం ద్వారానే వస్తాయి..
అది మీకు తెలియదు నాకు తెలియదు..
అలా సమస్యలు వస్తాయని కొన్నిసార్లు రావచ్చు రాకపోవచ్చు కూడా
నెలవంక వెళ్ళిపోతాను అంటుంది సూర్యుడు కొండల అంచున దాక్కొని పరిగెత్తుకొని వస్తాను అంటున్నాడు..
అలాగే పగలు అయిపోయిన తర్వాత రాత్రి ఎలా వస్తుందో
మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా అంతే
అది గుర్తుపెట్టుకొని మసులుకో మిత్రమా...

-మాధవి కాళ్ల

Comments