బెంగళూరు పనిమనిషి  గుండమీది కృష్ణ మోహన్,

Comments · 187 Views

బెంగళూరు పనిమనిషి  గుండమీది కృష్ణ మోహన్,

బెంగళూరు పనిమనిషి 


బెంగుళూరు పనిమనిషి అనగానే ఒక సినిమాలో చూపించినట్టు జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుని పని చేస్తుంది అనుకుంటున్నారా?

లేదండి. 
వేసవిలో చల్లగా ఉంటుందని ఆరోగ్య రిత్యా బంధువులు పిలిస్తే బెంగళూరుకు వెళ్ళడం జరిగింది. 
అక్కడ నేను చూసిన పనిమనిషి గురించి అండి.
ఇక విషయానికి వస్తే 
కొందరు మనుషులను చూస్తే మన బాధలు మరచి వాళ్ళు చేస్తున్న పని వల్ల సంతోషంతో పాటు ప్రేరణ కలుగుతుంది. అటువంటి కథనే ఇది.
బంధువుల ఇంట్లో పని మనిషి  అరవై ఐదు ఏళ్ల పై బడిన వృద్ధురాలు. శుభ్రంగా పాత్రలు తోమడం, ఇల్లు తుడవడం చూసినప్పుడు తన పనిని చూసి ముచ్చటేసింది.ఇంత వృద్ధాప్యంలో కూడా ఇంతలా కష్ట పండుతుందని జాలి వేసింది. తను ఈ వయస్సులో ఇంత కష్టపడుతున్నది కదా అని తన గురించి తెలుసుకోవాలని బంధువులను అడుగగా ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలిశాయి. అవి మీతో పంచుకుందామని రాస్తున్నాను.
తనకు ఒక కూతురు,ఇద్దరు కుమారులు ఉన్నారని, ఈ అపార్ట్మెంట్ స్థలం గతంలో తన వ్యవసాయ భూమి అని తను గతంలో తనకు గల రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసిందని తెలిసింది. నగరం పెరిగి వ్యవసాయ భూమి కాస్త అపార్ట్మెంట్ కు అమ్మవలసి వచ్చిందని తెలిసింది. ప్రస్తుతం తాను పనిచేస్తున్నది తన భూమిలో కట్టిన అపార్ట్మెంట్లొనే అని తెలిసి ఆశ్చర్యమేసింది. తన కూతురుకు పెళ్లి చేసిందని ఇద్దరు కొడుకులకు చదువు పెద్దగా రాక పోవడంతో భూమి అమ్మగా వచ్చిన డబ్బును చెరి ఒక కోటి రూపాయలతో పాటు చెరొక అపార్ట్మెంట్ ప్లాట్ కొని ఇచ్చిందని తెలిసింది. ఇద్దరు కొడుకులు ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చక్కగా చేస్తున్నారని తెలిసింది. 

ఇంతగా స్థిర పడిన కొడుకులు ఉండగా ఈవిడకి ఈ కర్మ ఏమిటి? కొడుకులు రానియ్యరా? అని అనుమానం వేసింది. 
తీరా చూస్తే ఇప్పటికి వారిది ఉమ్మడి కుటుంబం అని ఇంట్లో కొడుకులు,కొడళ్లకు వంట చేసి తరువాత ఐదు ఇళ్లలో పనులు చేస్తూ నెలకు పది వేల రూపాయలు సంపాదించి కొడుకుల పిల్లలకు బట్టలు కొని ఇస్తుందని తెసిసింది. 
ఈమెకు ఏమైనా పైసా పిచ్చా అని అంటే కాదు. తాను చేయగలిగినంత కాలం పని చేయడం ఇష్టమని తన కాళ్లపై తాను వీలైనంత వరకు బతకడం వల్ల తృప్తి ఉంటుందని తెలిపింది.

కొద్దిగా డబ్బులు కనబడితే పక్కమనిషిని కూడా పట్టించుకోరు కొందరు అలాంటిది. ఎంతో ఆస్తిఉండి కూడా  వృద్ధాప్యంలో ఇళ్లలో పాచి పని చేస్తూ బతకడం తన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.

              కృషితో నాస్తిదుర్భిక్షం 

గుండమీది కృష్ణ మోహన్,

Comments