సాయి చరితము-234    -సి.యస్.రాంబాబు

Comments · 166 Views

సాయి చరితము-234    -సి.యస్.రాంబాబు

సాయి చరితము-234


పల్లవి
బ్రోచే భారము నీదయ్యా సాయి 
మము బ్రోచే భారము నీదయ్యా సాయి 
ఆపదలో మేముంటేను సాయి 
ఆదుకునేందుకు వస్తావుగ సాయి

చరణం
జీవితానికో అర్థము చెప్పెను సాయి 
సకలజీవులు ఒకటే అనెను సాయి 
సాటిమనిషికీ సాయము చేయమనెను
సద్గురు సాయి తోడుగ ఉండు మనకు 

చరణం
మనసా వాచా గురువును
నమ్మితేమంటే 
మనసుకు శాంతి దొరకును కాదా 
రేపన్నది ఉన్నది లేదో కానీ
సద్గురు సాయి తోడుగ ఉండును మనకు 

చరణం
ఆడంబరములు వద్దని చెప్పెను సాయి 
పరుల హితమునే మార్గము చేసెను 
మనకు 
సాయి ధ్యానమే ఎంతో సౌఖ్యము భాయి 
సద్గురు సాయి తోడుగ ఉండును మనకు 

చరణం
సాయి నామము పలుకుము నిత్యము నీవు 
భేదభావనలు తొలగునులెండి 
సాయి చరితమే చదివితిమంటే 
సద్గురు సాయి తోడుగ ఉండును మనకు 

   -సి.యస్.రాంబాబు

Comments