తిరుమల గీతావళి,-సి.యస్.రాంబాబు

Comments · 153 Views

తిరుమల గీతావళి,-సి.యస్.రాంబాబు

తిరుమల గీతావళి

పల్లవి
కలలోన ఇలలోన 
శ్రీనివాసుడు మమ్ము 
కాపాడు దైవమని నమ్మితిమి మేము 
కష్టాల నావను తీరమును చేర్చును

చరణం
కలిమి లేములు మాకు కొత్తేమీ కాదు 
శ్రీనివాసుడే మాకు 
అన్నింట రక్ష
ఆపదలు ఆపేది గోవిందుడొకడే
ఆనందనిలయుడే ఆదుకుంటాడుగా 

చరణం
ఏడుకొండలు మాకు ఇలలోన స్వర్గం 
అది ఎన్నడూ మేము మరువం..మరువం..
తన నీడలోనే జీవితము గడిచే 
తన అండలోనే కోరికలు తీరె

చరణం
రేపంటు ఉన్నదో తెలియలేదుగ మాకు 
నువ్వన్నవన్నది ఒక్కటే తెలుసు.
మా ఊపిరే నీవు అని తలచి మేము 
నీ కీర్తనలతోటి ఊరడిల్లెదము

చరణం
శ్రీవెంకటేశ్వరుడు పెన్నిధే మాకనుచు 
కొండంత భక్తితో కొలిచేము తండ్రి 
కొండలరాయా..మా శ్రీనివాసా 
మహిలోన వెలసిన ఓ చిద్విలాసా 

సి.యస్.రాంబాబు

Comments