అన్నపూర్ణే - నంద్యాల అంబా భవాని 

Comments · 192 Views

అన్నపూర్ణే - నంద్యాల అంబా భవాని 

 

తన బిడ్డ ఆకలే కాదు,ఏ బిడ్డ ఆకలయినా కనగలిగే......
"అన్నపూర్ణే మాతృమూర్తి "!
తన బిడ్డయందే కాదు,ఏ బిడ్డయందయినా అనురాగం చూపగలిగే.....
"అరుణవర్ణే మాతృమూర్తి "!!
తన బిడ్డతో బంధమే కాదు,ఏ బిడ్డనయినా అమ్మదనపు కదలికతో చూచు......
"పరిపూర్ణే మాతృమూర్తి"!!
తన బిడ్డపై ప్రేమే. కాదు,ఏ బిడ్డకయినా స్వచ్ఛమైన ప్రేమను యివ్వగలిగే.....
"సంపూర్ణే మాతృమూర్తి"!!

పిల్లలను కని,పెంచితె అమ్మలవుతారంతే!లోకులు పిల్లలందరిపట్లా అమ్మదనపు కమ్మదనమును యివ్వగలవారే......
"మాతృమూర్తులవుతారు

- నంద్యాల అంబా భవాని 

Comments