విస్పోటనమై కాల్చేస్తుంది...!!!

Comments · 254 Views

విస్పోటనమై కాల్చేస్తుంది...!!!-దేరంగుల భైరవ

విస్పోటనమై కాల్చేస్తుంది...!!!

చితికిన మనస్సులో ఎన్నో
కావించని అర్థాలకు దారులుండవు
నీవున్నావన్నది మరిచిన సంగతులు
క్షణాలను కర్తవ్యంగా మలుచుకోలేక...
చలిమెలూరని ఎదలోతుల్లో చిగురులు
తడి ఆరుతు రచించని నమ్మకాలతో
జీవితం ఓడిపోతుంది...

చూడని మణిదీపాలు మాయల
లోకానికే అంకితమను కోవద్దు...
గడిచిన సమయాలలోని గారాబాల
గుర్తులను తీపి జ్ఞాపకాలుగా
వదులుకోలేక...
నిలువని ధైర్యం మబ్బును కప్పుకొని
పగిలిన దాతువుల దాష్టికాన్ని
కన్నీరుగా కారుస్తున్నది...

శ్వాసలు నిలిపిన విశ్వాసంతో
చితికిన నీ స్వేచ్ఛను విరిగిన రెక్కలతో
శూన్యం బోధపడకా...పూయని
ప్రేమలతో మానసిక వికాసాలు దుర్లభమై
ఆకలి వేదనని దాహంగా తాగుతు...
నిలిచిన స్థూపమై నీలో దాగిన నిజాలను
ఖచ్చితమై చూపలేక పోతున్నావు...

పిలిచిన అంగీకారాలతో
అభిమానం పంచుకోలేని వ్యర్థమై...
నెగడని మనస్సుతో నలిగిపోతు
ఆకలింపులేని మనుషుల పోకడలు
ఎదపొడుపులై ఆలకించని నిర్ణయాలు...
పూసగుచ్చనివిగా హృదయాగ్నికి
ఆహుతవుతు... అవేకళ్ళలో దాగిన
లావా విస్ఫోటనమై కాల్చేస్తుంది...

-దేరంగుల భైరవ

Comments