పోతోంది మనుషుల లోకమని...!!!-దేరంగుల భైరవ

Comments · 222 Views

పోతోంది మనుషుల లోకమని...!!!-దేరంగుల భైరవ

పోతోంది మనుషుల లోకమని...!!!


పోతోంది మనుషుల లోకం
సెల్లుఫోను మాయతో సర్వనాశనమై
పోతోంది ఈ మనుషుల లోకమని...
పోతోంది మనుషుల లోకమని...

ఆకారానికి హస్త భూషణమైనా...
కొంపలు ముంచే కొరివి దయ్యమై
కోరికలు పెంచిన రంగుటద్దంగా
నిన్ను మరిచిన ఉనికికి తిలోదకాలిస్తు
నిజాన్ని నిలువునా ముంచేస్తుంది...
పోతోంది మనుషుల లోకమని...

డొంక తిరుగుడు మాటలతో
ఉన్నది చెప్పకోలేని చాదస్తంగా...
కూటి కొరకు కోటి విద్యలై అగచాట్ల
పర్వంతో నరుడు వానరుని కంటే...
హీనమై నల్లబారిన కొండముచ్చులై
కనబడుతున్నారు...
పోతోంది మనుషుల లోకమని...

పూజితం కాని మానవత్వాన్ని
మనుషులై మంటగలుపుతు...
కదిలే నాలుక నీతిని మరిచిపోతు
నీవన్నది నీకే తెలియక...
మన్నికలేని మానవ సంబంధాలు
ఊటలెండుతు పాతాళానికి ప్రయణమై
పోతోంది మనుషుల లోకమని...

-దేరంగుల భైరవ

Comments