బ్రేకప్

Comments · 324 Views

బ్రేకప్ - ఉమాదేవి ఎర్రం

బ్రేకప్ 


రాధా, రాణి ప్రేమలో పీకల లోతుల్లోకి వెళ్లిపోయారు
రాధా అంటే ఆడపిల్ల అనుకునేరు అనుకుంటే పప్పులో
కాలేసినట్టే!
రాధాకృష్ణ అబ్బాయే!
అయితే ఆ ప్రేమను ఇద్దరూ ఎవరింట్లో వాల్లు చెప్పాలంటే భయమే!
కానీ చెప్పకపోతే ఎలా? జీవితాంతం కలిసి ఉండడం ఎలా?
రాణి వాల్ల నాన్న ఛండ శాసనుడు అసలు ప్రేమలన్నా
ప్రేమించుకునే వాల్లన్నా చాలా అసహ్యం..
అందుకే రాణి ఇంట్లో చెప్పలేక పోతుంది..
అటు రాధాకృష్ణ పరిస్థితీ అంతే!!
కానీ కలుసుకున్నప్పుడంతా ఇవే ముచ్చట్లతో గడిచి
పోయేది..
నువ్వే ఇంట్లో చెప్పు,అంటే నువ్వే చెప్పు అనుకునే వారు..
ఇలా గడుస్తుండగా!
ఒక రోజు రాణి బర్త్ డే వచ్చింది ..
నా బర్త్ డేకి మంచి రింగ్ ప్రజెంట్ చేయి అంది..
అమ్మెా! రింగా? గోల్డ్ దే! నా వల్ల ఎలా అవుతుంది?
అన్నాడు..
ఏంటి? అవదా? ఎప్పటి నుండో ఉధ్యోగం చేస్తున్నావు
నీతో ఆ మాత్రం అవదా? ఓ రింగే కొనలేని వాడివి రేపింకా నన్నేం పోషిస్తావు? నేనడిగినవేమి కొనిస్తావు?
నీ కోసం మా ఇంట్లో ఎదిరించడం వేస్ట్..
నీకు నాకు బ్రేకప్ అంది రాణి..

అయ్యెా! అలా అనకు రాణీ అని వాపోయాడు..
తన నాన్న రాణి వాల్ల నాన్న కన్నా ఘోరమని తన జీతమంతా ఆయనే తీసుకుని తనకు పాకెట్ మనీ కూడా ఇవ్వడని రాణితో చెప్పలేని పరిస్థితిలో అలా అనకు అని మాత్రమే అన్నాడు..
అయినా బ్రేకపే అయింది..

ఓ రెండు సంవత్సరాలు గడిచాక  రాధాకృష్ణకు రాణికి కూడా పెళ్లిల్లయ్యాయి..
పెద్దలు కుదిర్చిన పెళ్లే! 
పెళ్లి పందింట్లోనే  ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు చూసుకుని తెల్లబోయారు  ఎందుకంటే
బ్రేకప్ చెప్పుకున్న వాల్లిద్దరే కనుక..

మెుదటి రోజు రాత్రి రాణి వేలుకి ఆమె అడిగిన ఉంగరం
తొడిగాడు రాధా..
ఉంగరం కొనలేనన్నావ్ అంది రాణి..
ఆ రెండు సంవత్సరాల నుంచి  పాకెట్ మనీ లో కొంత మిగిల్చి ఎప్పటికైనా ఏ అమ్మాయి కైనా ఇలాంటి అవసరం వస్తుందని కొని ఉంచాలే! అన్నాడు..
నేనడిగితే ఏ అమ్మాయికైనా ఇస్తావా? అంటూ తలగడతో నవ్వుతూ కొట్టింది రాణి..
మరి నాకు బ్రేకప్ చెప్పి బుద్ది చెప్పావుగా! అన్నాడతను..
మన ప్రేమ స్వఛ్చమైంది అందుకే దేవుడు మనిద్దరినీ
కలిపాడు అంటూ రాధా హృదయానికి అతుక్కు పోయింది రాణి..
అవును నిజమే ! అంటూ రెండు చేతులతో కౌగిలించు కున్నాడు రాధా..

సమాప్తం..

 

          -ఉమాదేవి ఎర్రం

Comments