కిచకిచలాడే గువ్వలం.-రుద్రపాక సామ్రాజ్యలక్ష్మి

Comments · 227 Views

కిచకిచలాడే గువ్వలం.-రుద్రపాక సామ్రాజ్యలక్ష్మి

కిచకిచలాడే గువ్వలం

గూటిలోని గువ్వలులా అలా కూర్చుంటారేమే? స్కూల్ టైమ్ అవుతోందికదా,త్వరగా రెడీ అవ్వండి అంటూ కేకలేసింది అక్షయ.

మేము నీ కంటికి అలాగే కనిపిస్తాము.స్కూల్ కి వెళ్ళిన తరువాత టీచర్స్ పెట్టే హింస నీకేమి తెలుసు అంది పెద్ద కూతురు రాధిక.చిన్న కూతురు కూడా బుంగ మూతి పెట్టి నిన్న నన్ను గోడ కుర్చీ వేయించారు అంది.

రాత్రి పన్నెండింటి వరకు మొబైల్ లు, టీవీలు పెట్టుకుకూర్చుని హోమ్ వర్క్స్ చెయ్యకుండా స్కూల్ కి వెళితే, మరి ముద్దెట్టుకుంటారా మరి.

మీమిస్ కి ఫోన్ చేసి ఇంకా రెండు తన్నమంటాను.మీరు వాటికి అడిక్ట్ అయిపోయి చదువు,ఆటలు,బంధుత్వాలు కోల్పోతున్నారు.

మీరు జీవితం లో ఎన్ని సంతోషాలు కోల్పోతున్నారో మీకు తెలియడం లా అంటూ బుద్ధి చెప్పింది అక్షయ.

అమ్మ చెప్పిన విషయం చాలా ఆలోచించిన తర్వాత పిల్లలిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు,చేతిలో ఉన్న ఫోన్ పాక్క్న పెట్టేసి, టీవీ ఆఫ్ చేసేసి తల్లి దగ్గరకు వచ్చి ఆమెను కౌగిలించుకుంటూ ..

అవునమ్మా,రేపటి నుండి టీవీ,మొబైల్ లకు స్వస్తిచెప్పి,కిచకిచలాడే గువ్వల్లా కువకువలాడతాము అన్నారు రాధిక,చెల్లి కూడా.

-రుద్రపాక సామ్రాజ్యలక్ష్మి

Comments