కొంగు బంగారమే...!!!
అమ్మాజూడు అమ్మా పిలిచె
కోరిన కోరికలు కొంగు బంగారమే...
ఎయిగండ్ల తల్లివి నీవు ఎల్లమ్మో
ఏటేటా నీకు యాటలతో బోనాలు...
మా పిల్లాపాపలతో శతకోటిదండాలు
ఎల్లమ్మో...ఎల్లమ్మో...
పసుపు కుంకుమలు పారాణిగా పూసి
యాపాకు మండలు తోరణాలుగా కట్టి
పొడిచేటి పొద్దులను తిలకంగా దిద్ది...
నవధాన్యాల వంటలు నైవేద్యంగా పెట్టి
నీ సల్లని సూపులతో ముక్కారులు పండి
చిగురాకు పచ్చలు పసిడి రాసులై
నిండాలని మా కష్టాలను దీవించే
ఘనమైన తల్లివి ఎల్లమ్మో....
అయిన వారు కానివారు ఉన్నవారు
లేనివారు బీదసాదలు మూకుమ్మడిగా
నడిపేటి జిమిడికె దరువులు...
మొక్కుబడీ తీర్పులతో ఎరుపెక్కిన
బాటలు శివసత్తుల ఆటలతో గళమెత్తిన
పూనకాలు గజ్జెకట్టినా కాలితో
కదంతొక్కుతు వస్తున్నామో ఎల్లమ్మో....
తప్పెట్ల దరువులతో ఊగేటి చిందులు
రక్తపు అడుగులతో బయలెల్లిన భక్తులు
చిందేస్తు గంతేస్తు నీ హారతి పళ్ళానికి
మే ఆధారపీఠమై ఎదలోని భావాన్ని
కళ్ళెదుటే చూపుతు పెంచుకొన్న
బంధాన్ని స్నేహంగా పంచుకొంటు
ఏడాది కొక్కసారి ఏతమైన మనస్సుతో
నీ జాతరకొస్తాము ఎల్లమ్మో...
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396
(బోనాల పండుగ సందర్భంగా)