ముత్యాల హారం
మనిషిని నడిపించేది ఎండమావుల వంటి ఆశలే కదా.మనిషి ఆశా జీవి.మనిషికి ఆ ఆశలనే
ఎండమావులులేకపోతే జీవితం నిర్వీర్యమై పోతుంది.
బ్రతుకు మోయలేని బరువు అయిపోతుంది.మనిషిని నడిపించేది ఆశ మాత్రమే అని నేను నమ్ముతాను .
రేపు అనే ఆశతోనే నేడు పడుకుంటాం.ఆ ఆశే రేపు తట్టి లేపుతుంది. జీవితంలో ఏది సాధించాలన్నా ఆశ ఊత కర్ర లాంటిది.
మనిషిని ఉత్సాహపరచేది,ఆకాశ హర్మ్యాలను నిర్మించుకోగలది ఈ ఆశలతోనే కదూ.
కానీ ఎండమావులను,నీటి చెలమలుగా మార్చుకోవాలంటే,మన ఆశలను సాకారం చేసుకోవాలంటే మాత్రం మనిషి అహరహం కష్టపడాలి.
డాక్టర్ రావుగారు చెప్పినట్లు అక్షర సేద్యంతోను, పట్టుదల,కృషితో మాత్రమే సుసాధ్యం చేసుకోగలం.
సో అందరం ఈ ఎండమావుల వంటి ఆశల సౌధాలను నిజం చేసుకుందాం .
నా అంశానికి నేను ఎంత న్యాయం చేయగలుగుతానో అని ప్రయత్నించా
-రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి