శీర్షిక : దూరాల నునుపు దనాలై...!!!
తోచని మధితో అంతులేని
అనంతంలోకి చూస్తూ కూర్చున్నా
మార్మికాన్ని మరిచిన మనస్సు
ఆలోచనల పురుగుగా చేరి పదే పదే
తొలుస్తు చెబుతున్నది...
గమనించని చిత్రాలతో జారిపోయే
గుణాలు గుర్తుండని మనుషుల కథలకు
నిరంతరం ఇదే మాయా లోకమని...
నత్త నడకన ప్రజాసంక్షేమం...
చిట్ట చివరన అమాయక జనం
ఆశల మడుగులో నీరెండుతున్న
నిజాలతో నిబద్ధతలను వదులుకొన్న
వైనం దూరాల నునుపు దనాలై...
అందని ఆ బహుమానం కష్ట కాలానికి
ఇదే మాయా లోకమని చూపుతుంది...
దొంగలు దొరలై రాజ్యమేలుతుంటే
మట్టి వాసనలను పెకిలించే రైతన్నల
కష్టం కూడగట్టలేక మనస్సుల తీరుకు
దొరకని మన్నిక ఇదే మాయా లోకమనే
తీర్మాణానికి నమ్మకమై అర్ధరాత్రి
స్వాతంత్ర్యానికి ఆమడ దురమై...
అబలల జీవతం అడుగంటుతున్నది...
అధికారాలకై అహర్నిశలుకాకు...
విభేదాలతో విడిపోకు నీ సోదాల
త్యాగబుద్ధితో హృదయం పిలిచినదిగా
కొత్తదనపు వ్యూహమై శ్రమల కోర్చిన
ఫలితంతో నీతి నిజాయితీలు బతుకునని
ఇదే మాయా లోకానికి అంకితమైన
మనుషుల ఉనికిన మార్చుతు ఈ లోకపు
శాసనాలతో ప్రామాణికమై నడుచు...
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396