చినుకులు
జలజల రాలే చినుకులు .
వడివడిగా తాగే అవని పగుళ్లు .
బిరబిర పరుగులుతీసే రోడ్లపై జనాలు.
చిదరవందర చినుకులు చేరి భువనం .
అంటిఉన్న తేమను ఆకాశానికి ఈడ్చుకెళ్ళేను .
ఆగిన వాన వరసే అవనికి వేసవి కడగళ్ళు .
ఋతుపవనాలకై చకోర పక్షులమై చూడాలి ఇక ..
-సత్యవతి ఆలపాటి.