నాకు నచ్చిన గురువు
శీర్షిక
మంచివారు మా మాష్టారు
నాకు నచ్చిన గురువు మా నాన్నే. ఆయన పేరు వెంకట రామకృష్ణ గారు.ఆయన సైన్స్ టీచరుగా పనిచేసేవారు. చివరికి హెడ్మాస్టర్ గా రిటైర్ అయ్యారు. ఆయన ఎందరో
పేద విద్యార్థులను తన సొంత డబ్బుతో చదివించారు. ప్రభుత్వ టీచరుగా పనిచేస్తూనే
సంఘం సేవా కార్యక్రమాలలో
పాల్గొనేవారు. ఆయన మాకు
ఎన్నో మంచి విషయాలు
బోధించేవారు. చదువు ఒక్కటే కాదు మాకు లోకజ్ఞానం కూడా నేర్పారు. పిల్లలంతా బాగా
చదువుకోవాలి అనేది ఆయన
కోరిక. అందుకోసం ఎంతో కృషి
చేసారు. తాను పనిచేసే స్కూలు పిల్లలను సైన్స్
ఎక్సిబిషన్ లో పాల్గొనేలా
చేసి వారు బహుమతులు
గెలుచుకొనేలా తర్ఫీదు
ఇచ్చేవారు. విలువలు
పాటించే విద్యార్థులే
గొప్ప స్ధాయికి చేరుతారని
ఆయన నమ్మకం. ఆయన
చనిపోయి రెండు దశాబ్దాలు
గడిచినా ఇప్పటికీ ఆయన
లేని లోటు మాకు తీర్చలేనిది.
మా నాన్నే మా రియల్ టీచర్.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని.