సిరాచుక్క
కలాన్నికత్తిలా వాడటంతెలిసిన నాడు..
గళాన్ని గొంతెత్తి పోరాటానికి సిద్ధంచేసిన నాడు..
గుండె నిండా బలాన్ని
నింపుకొని నిప్పురవ్వల
సమస్యల మీద సమరాన్ని సాగించిననాడు..
ఎత్తిన పిడికిలి కొడవలై
ప్రజల అసమానతలను
రూపుమాపిననాడు..
నీ సిరా చుక్కే అందరిని
భయపెట్టె ఆయుధమవుతుంది...
-ప్రవీణ్