నీలాగే నేనుంటే..

నీ లాగే నేనుంటే..
తొక్కేస్తారు..
అణిచేస్తారు..
నీలాగే నేనుంటే..
నీడ లేకుండా చేస్తారు..
నిండా ముంచేస్తారు..
నీ లాగే నేనుంటే..
అంతా మెాసం చేస్తారు..
అందుకే నిన్ను చూసి..
నేర్చుకున్నా..
నీ జీవితమే నాకో పాఠం..
నేర్పిందో గుణపాఠం..
నిలబడ్డా కలకాలం..


ఉమాదేవి ఎర్రం..