మృగతృష్ణ రామకూరి ఎల్.మణి

Comments · 251 Views

మృగతృష్ణ రామకూరి ఎల్.మణి

మృగతృష్ణ

 

ఎండమావులు

దగ్గర కెడుతుంటే
ఇంకా దూరం జరిగేను

దాహార్తిని తీర్చలేని
చిత్తరువులే అవి

పరిగెత్తే గుర్రాల వోలే
భ్రాంతిని గొల్పే మరీచికలు

జీవితంలో కూడా అలాంటి
మృగతృష్ణ లెన్నో

భ్రమ పడక సాగిపో
మున్ముందుకు

మావిలోంచి బయట పడ్డట్టు
భ్రాంతి లోంచి బయటకు రా

కనికట్టు లాంటిదీ జీవితం
కనిపెట్టుకు ఉండు సతతం

 

రామకూరి ఎల్.మణి

Comments