నాఅంతరంగము
నా అంతరంగము నేడు
అంతులేని ఆవేదనతో నిండింది .....
నా మదిలోని ఆశలు, ఆశయాలు...
అడియాశలయ్యాయి నేడు
నా మది రొద తెలియని
మనుషుల మధ్య ఎండమావిల
మిగిలి వున్నాను.... నా వారందరూ ఆప్యాయత లు
అనురాగాలు, సమాధి చేసి...
నా జీవితాన్ని ఎడారి పాలు చేశారు.....
అంతే లేని ఆలోచనల సాగరంలో
చుక్కాని లేని నావలో నా ప్రయాణం
ఏదరికో,ఎటో వెళ్లి పోతుంటే
బాధ్యతల మధ్య బంధీనై....
ఎడారిలోని కోయిల లా
ఎడారిలో ఎండమావిలా..
నాలోని ధైర్యము నశించి
నా సహనం కోల్పోయి....
మౌనంగా ఈ జీవితాన్ని
సాగిస్తున్నాను ఎడారిలోని ఎండమావిలా..
- లీలావతి