అహమేవబ్రహ్మ
ఆనందమే బ్రహ్మ స్వరూపం...
అన్నం పరబ్రహ్మ స్వరూపం.....
అహమే బ్రహ్మ స్వరూపం....
మన జీవిత చదరంగం లో...
మన మనసు చేసే గారడి తో
మన ఆట మనమే ఆడుదాం...
ఎన్నో సోపానాలు ఎక్కుతూ...
ఎన్నో మలుపులు తిరిగే దారి
ఎన్నెన్నో వింతల సంతలో.....
ఆనందమే మకరందంగా గ్రోలి
జీవిత కడదాక సాగుదాము....
జీవిత యానం లో కలసి సాగి
ముందుకు పోదాం పైపైకి.....
అలసి సొలసిన మనసులకు,
ఆనందపు జల్లులు పంచుదాం.
ప్రేమ, ఆప్యాయత విత్తనాలతో
అక్షర సేద్యం చేస్తూ సాగుదాం.
కష్టాల కడలిలో సాగే వారికి
చేయి అందించి సాయం చేద్దాం
చిరునవ్వులు అందరికీ పంచి
చీకటిలో చిరు చిరు దివ్వెలుగా వెలుగుదాం ...
ఆనందంతో ముందుకు సాగుదాం .....
-చిరంజీవి.బి.