దేహం పూయని త్యాగంగా...!!!

Comments · 228 Views

దేహం పూయని త్యాగంగా...!!!, రచయిత దేరంగుల భైరవ

దేహం పూయని త్యాగంగా...!!!

వీడిన క్షణాలు ఒద్దికలు కాలేక...
నెగడిన దశకంఠాలకు ఆలవాలమై
నిజమెంతో గాయమని భయకంపిత
మవుతు...హృదయం అఘాతమవుతు...
నిన్నటి శ్వాసలతో నేర్చిన వింతశ్లోకం
నేడు మా బతుకులకు విరహగీతమై
వినబడుతున్నది...

మధమెక్కిన మధగజాలతో
తిరగబడని దేహాలు బానిసలై మగ్గుతు...
నీతితప్పుతున్న ధర్మా ధర్మాలు
కాల భ్రమణాలై కుంటుబడుతు...
వెదకే కారుణ్యం నాలుగు పాదాలతో
రాక్షస వాదమై...తీర్పు కాలేని నిశీతో
చుట్టబడిన మా దైన్యం అబలలుగా
బలిగొనబడుతున్నవి...

ఎదురు తిరగబడని అమాయకత్వం
వెన్నులో దిగబడిపోతు...
అర్ధరాత్రి స్వాతంత్ర్యమై తిరగలేక...
చీకటి కోరలు కంటి చూపులతో పదునవుతు
దిగుడుబడని గొంతున శ్వాసలు
వెర్రిముఖాలై కర్మభూమిన దేహం పూయని
త్యాగంగా కడతేరవలసిందేనా...

చరాచర సృష్టికి ఆధారమై...
అవని ధార్మికతకు ప్రతి రూపమై
కదిలే మానసిక వికాసాలకు కాలభ్రమణాలు
కారణం కాదని...తలచిన మధిలో
స్థానమై ఒడినించుకొన్న అహర్నిశలతో
కాలాన్ని అనుసరిస్తూ...భ్రమణాలను
మనస్సుతో నడిపించక ప్రకృతిలో పెరిగిన
తనువుతో పురుడోసిన ప్రతి మనిషిని
నడిపించే శక్తి స్వరూపిణి...ఆడదే...

- దేరంగుల భైరవ 

Comments