కల్పితమైన బొమ్మలు
మమత తన తమ్ముడికి చిన్నప్పటినుంచి కార్టూన్ బొమ్మలు అంటే చూడడం చాలా ఇష్టం. కార్టూన్ బొమ్మల్లో టామ్ అండ్ జెర్రీ, బాగా ఎక్కువగా డోరేమాన్ చూసేవారు. ఇంట్లో వాళ్ళు తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు వెళ్లావు? ఏంటి అని అడుగుతున్నారు. అదే డోరేమాన్ నా దగ్గర ఉంటే చాలా చోట్లకి వెళ్లొచ్చు అని అనుకోని పడుకుంది మమత.
ఒకరోజు కలలో డోరేమాన్ తన దగ్గరికి వచ్చి కొన్నాళ్లు నీతో పాటు ఉంటాను అని చెప్పింది. డోరేమాన్ చెప్పిన మాటలకు ఆనందపడి తనని మమత ఇంట్లో ఉంచుకుంది. అలా రేపు ఏం జరుగుతుందో అని టైం మిషన్ లో వెళ్లి తెలుసుకునేది మమత. ఫ్రెండ్స్ అందరూ దగ్గరికి ఎనీ వేర్ డోర్ ద్వారా వెళ్ళేది. వాళ్ళ ఫ్రెండ్స్ తో రాత్రి వరకు ఆడుకునేది.
అలా రోజులు గడిచిపోతుండగా, ఒకరోజు "నువ్వు నాకు ఎంతో అభిమానవని అనుకొని, నేను నీ దగ్గరికి వచ్చాను" అని డోరేమాన్ చెప్పింది. మమత డోరేమాన్ అన్నమాటలకి ఏడుస్తూ, "నువ్వు నాకు చాలా ఇష్టం. నువ్వు నా దగ్గర ఉంటే ఏ పనైనా చేయగలుగుతాను" అని ఏడుస్తూ చెప్పింది. ఇప్పుడు నా గ్యాడ్జెట్లన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా నోబితా లాగా నా దగ్గర గ్యాడ్జెట్లను చూసి ఇష్టపడ్డావు. అందుకే నిన్ను వదిలి నేను వెళ్ళిపోతున్నాను" అని డోరేమాన్ చెప్పి వెళ్ళిపోయింది.
డోరేమాన్ వెళ్ళిపోయిన తర్వాత, ప్రతిరోజు డోరేమాన్ ని తల్చుకుంటూ బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకునేది. ఇలా చేస్తే నైనా డోరేమాన్ మళ్లీ తిరిగి వస్తున్నాను నమ్మకంతో ఉంది మమత. కాలభ్రమణం తిరుగుతుండగా మమత ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందని గమనించారు తల్లిదండ్రులు. ఒకరోజు స్కూల్ లో జరుగుతున్న స్పోర్ట్ పోటీలో పాల్గొనడానికి సిద్ధమవుతోంది మమత. సడన్గా ఏమైందో కానీ కళ్ళు తిరిగి పడిపోయింది.
కంగారుగా మమతని హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ అన్ని టెస్టులు చేసిన తర్వాత తను ఏదో మానసిక రోగంతో బాధపడుతుదాన్ని, ఆ వ్యాధి నయం చేయడానికి ప్రయత్నించాలని చెప్పారు డాక్టర్. మమతని ఒక రెండు నెలల పాటు స్కూల్ కి పంపించకుండా తనతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు గడిపేవారు. అయినా సరే తన వ్యాధి తగ్గక ఒక రోజు రాత్రి చనిపోయింది మమత.
కార్టూన్ బొమ్మలు నిజమైనవి కావు. వాటి మీద ఇష్టం పెంచుకోవచ్చు కానీ మరి ఎక్కువగా పెంచుకోవడం వల్ల ఇలాగే మమత లాగా చనిపోతారు. ఆ బొమ్మలు కల్పితమైనవి నిజమేనది కాదు అది గుర్తుపెట్టుకుని ఉంటే చాలా మంచిది. కల్పితమైన బొమ్మలు మీద ప్రేమ పెంచుకోవడం మంచిది కాదు అది పిల్లల ప్రాణాలకే ముప్పు.
- మాధవి కాళ్ల