పరమానందం
విజయనగరం జిల్లాలో,అత్యంత ద్దనికుడు,భూస్వామి 'జమీందారు 'ప్రతాప్ రావు బహద్దూర్ గారు'.
తరతరాలు గా సంక్రమించిన వందల ఎకరాల పొలాలు,భవనాలు ఈ నాటికి కూడా ఆయన మకుటం లేని మహారాజులా,ఎక్కడికి వెళ్లినా అత్యంత గౌరవింపఁబడేవారు.
జమీందారు గారు ఒకరోజు అలా షికారుగా తన పొలాలలను పరిశీలిస్తూ చుట్టుప్రక్కల గ్రామాలలో పర్యటిస్తూ ఉంటే ఆ గ్రామాల ప్రజలు వంగి నమస్కారాలు చేస్తుంటే తన అభివాదం చేస్తూ సాగిపోయారు.
అలా, ఒక ఊళ్ళో తన తాత ముత్త్త్తాతల చిత్రపటాలు,శిలా విగ్రహాలు ఉండడం చూసి ఆనంద భరితులై," ఆహా,ఎంత గౌరవం,"అనుకొంటూ ఒక నిర్ణయానికి వచ్చి "ఒరే ,నాకు కూడా అలా చిత్రపటం,శిల్పం చేయించు కోవాలని ఉంది, అవి నేను పోయిన తర్వాత కూడా నాకు ఆత్యంత గౌరవం కలుగుతుంది. కనుక అన్ని ఊళ్ళో, గ్రామాల్లో చాటింపు వేయించండి." నా చిత్రపటం,శిల్పం చేసినవారికి '20ఎకరాల మాగాణి భూమి,10 లక్షల డబ్బు,ఒక ఇల్లు బహుమతి ఇస్తాను, లేకపోతే 100 కొరడా దెబ్బలు తినాలి" అని దండోరా వేయించండి" అని ఉత్తర్వులు జారీచేశారు.
ఆ ప్రకటన వినగానే ప్రముఖ చిత్రకారులు,శిల్పులు జమిందార్ గారి భవంతి కి వేంచాసారు.అత్యంత ఆశ తో వచ్చిన కళాకారుల ను ఉద్దేశించి "జమీందారు గారు, మీరందరు నా ప్రకటన వినేవుంటారు,మీకందరికీ తెలుసు నా అంగవైకల్యం, నాకు ఒక కన్ను, ఒక కాలు లేవు కనుక ఈ అంగ వైకల్యం కనపడుకొండ నా చిత్రపటం,శిల్పం చెయ్యాలి, బహుమతి ప్రజాసమక్షంలో ఇస్తాను" అని ప్రకటించారు జమిందార్ ప్రతాపరావు బహద్దూర్.
అరే, అదెలా సాధ్యం? జమీందారు గారికి మతిపోయింది,ఒక కాలు లేకుండా, ఒక కన్ను లేకుండా చిత్రపటం,శిల్పం ఎలా తయారు అవుతుంది,పోనీ వేస్తే బాగులేకపోతే 100 కొరడా దెబ్బలు పడతాయి,మనవల్లా కాదు అని ఒక్కక్కరు మెల్లిగా ఎదో కారణం చెప్పి జారుకొంటున్నారు . కానీ "జక్కన్న"అనే చిత్రకారుడు,శిల్పి ఎలాగో జీవితం లో అన్ని విధాలా నష్టపోయి చివరి అవకాశం ప్రయత్నించాలి, అనుకోని "జమీందారు గారు నేను నా చివరి ప్రయత్నంగా పని మొదలు పెడతాను, నాకు వారం రోజులు సమయం పని చేయడానికి కావలసిన సరంజామా ఇప్పించండి,అని అనగానే జమీందారుగారు అన్ని వసతులతో ఏర్పాట్లు చేయించారు. మిగతా వాలందరు "పాపం,జక్కన్న ప్రాణం వారం రోజుల్లో పోతుంది కొరడా దెబ్బలు తిని,అని నవ్వుకొంటు వెళ్లిపోయారు.
'జక్కన్న' రెండు రోజులు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తన పని ఏకాగ్రతతో మొదలుపెట్టాడు,ఎంతో రహస్యంగా.
ఇక చివరి రోజు జక్కన్న'జమీందారుగారు, రేపు నా చిత్రకళ,శిల్పకళా ప్రజా సమక్షంలో మీకు చూపిస్తాను,అన్ని ఏర్పాట్లు చెయ్యండి,మీకు నచ్ననట్లయితే అందరి ముందు 100 కొరడా దెబ్బలు తింటాను' అని అనగానే ఉరుఅంత దండోరా వేయించారు జమీందారుగారు.
సరిగ్గా 10 గంటలకు కిక్కిరిసిన ప్రజా సమక్షంలో జమిందార్ "ప్రతాప్ రావు బహద్దూర్ గారు" ఎంతో ఉత్సాహంతో వెంచేసారు.
'జక్కన్న' కూడా అదే ఉత్సాహంతో విజయమో,వీరస్వర్గమో అనుకొంటూ జమీందారుగారికి నమస్కరిస్తూ అందంగా అలంకరించబడిన స్టేజి మీద ఎత్హుగా పెట్టబడిన పెద్ద చిత్రపటం,శిల్పం దగ్గరకు తీసుకువచ్చాడు.
ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న సమయంలో జమీందారుగారు మొదటి ఎర్రటి పట్టు శాలువా కప్పి ఉన్న తాడుని లాగి చిత్రపటాన్ని చూస్తూ ఎంతో ఆశ్చర్యంగా ఆనందంతో జక్కన్నవైపు చూస్తూ ఇంకా శిల్పం ఉన్న పట్టు శాలువాన్నీ కూడా తీసి సంభ్రమాశ్చర్యాలతో,"జక్కన్న,నువ్వు సాధించావురా, నా చిత్రపటం,శిల్పం చాలా అందంగా చేసావు, ఇవి అన్ని ఊళ్లోని పెట్టించండి,నేను పోయిన తర్వాత కూడా తరతరాలు గుర్తుండిపోయేలా చేసావు", అనగానే ప్రజలందరి కరతాళధ్వనులతో మారుమోగిపోయింది.
ఇంతకీ అంత నచ్చిన అంశం ఏమిటంటే ,జక్కన్న జమీందారు గారి అంగవైకల్యం ఎంతో కనపడనీయకుండా జమీందారుగారు వేటకు వెళ్ళినప్పుడు తెల్లటి గుర్రం మీద కూర్చొని ఒక కుడి కాలు మాత్రమే కనపడేట్టు లేని ఎడమకాలు రెండో ప్రక్క ఉన్నట్లు , ఒక చేత్తో విల్లుఎక్కుపెట్టి పులిని వేటాడుతున్నట్లు గురి కోసం లేని ఒక కన్ను మూసి ఉన్నట్లు మరో కంటితో గురి చూస్తున్నట్లు గీసిన చిత్రపటం,గాని శిల్పంగాని ఎక్కడ జమీందారిగారి అంగవైకల్యం కనపడనీయకుండా ఆకర్షణీయంగా చిత్రపటం గీసి,అలాగే ఎంతో నైపుణ్యం తో శిల్పం చెక్కి అందరిని ఆశ్చర్య చకితులను చేసాడు 'జక్కన్న'.
అలాగే ప్రజలందరి సమక్షంలో,"జక్కన్న, నీ ప్రతిభకు,నీ కృషికి నేను 20 ఎకరాల మాగాణి భూమి,10 లక్షల రొక్కం, ఒక భవనాన్ని నీకు ఇస్తున్నాను,అన్ని ప్రధాన ఊళ్ళో ఇలాగే తయారు చేసి పెట్టించు".అని జక్కన్నను కౌగలించుకోగానే హర్షద్వానాల మధ్య ఎంతో ఆనందంగా జక్కన్న నమస్కారాలు చేస్తూ తన కృతజ్ఞతలు చాటుకున్నాడు.!!.
ఇందులో ఉన్న జీవిత పరమార్థం ఏమిటంటే "పరులలో ఉన్న తప్పులను,లోపాలను ఎత్తి చూపకుండా,అవమానించకుండా వారి జీవితాల్లో ఆనందం నింపడమే!"::::
-వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు