అందమైన జాబిల్లి అందిన రోజు

Mga komento · 273 Mga view

అందమైన జాబిల్లి అందిన రోజు - ఎమ్ రాజమణి

అందమైన జాబిల్లి అందిన రోజు

అందమైన చందమామ
అందరాని చందమామ
అమ్మ భరతావానికి అందంగా చిక్కినాడే
టకరి టకరి చందమామ
టక్కునిక్కుల చందమామ
మబ్బుల చాటున దోబూచులాడే జాబిలమ్మ
భారతమ్మ హృదయానికి హృద్యంగా హత్తుకుండే
చంద్రాయన్ సంబరంగా ఆనందమే అంబరంగా
విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని మురిపెంగా ముద్దాడే
భారతమ్మ ఆశలన్నీ జాబిలమ్మ ఆరబోసే
విశ్వవిను వీధుల్లో మువ్వన్నెల జాతి పతాకం
రేప రేపలాడేను సగర్వంగా
భారత వాణి ముద్దుబిడ్డలు మురిసిరి మురిపెంగా
జాబిలమ్మ దక్షిణ ధ్రువం పై అలవో కగవాలిపోయే
భారత శాస్త్రవేత్తల మేధస్సుకు శతకోటి వందనాలు
ప్రపంచ దేశాలకు భారతమ్మ ఆదర్శం
అందమైన జాబిలమ్మ అందిన రోజు సువర్ణాక్షరాలతో లిఖించిన సుధీనం
మానవాళి మనుగడకే మైలురాయి చంద్రాయన్ 3
నెల రాజు చుట్టూ ఉన్న గుట్టు విప్పి తీరును
జయము జయము భరతమాత జయము నీకు జోహార్లు
ఇస్రో మహిళా శాస్త్రవేత్తలకు జోహార్లు జోహార్లు
భరతావని గర్వించదగ్గ మహిళా మణులకు శతకోటి వందనాలు

- ఎమ్ రాజమణి

Mga komento