జాబిలి
అలా గగనసీమలను ఏలే జాబిల్లి
ఇలా చల్లని వెన్నెల విరిసే జాబిలి అలా నక్షత్రాలను మురిపించే జాబిలి
ఇలా భామలను మైమరిపించే జాబిలి.
అలా వెలిగిపోతున్న పున్నమి జాబిలి .
అలా నీ దరి చేరాములే జాబిలి.
నీ హృదయ సీమను గెలిచాము జాబిలి.
పసితనములోనే మా మానసాలను కొల్లగొట్టిన జాబిలి.
నీ మానస రోవరమును తడమగ దరి చేరాము జాబిలి.
మాకు అండగా ఉండవయ్య జాబిలి .
నీవడి చేరిను భారతజండా జాబిలి .
నీ మోనుపై రెపరెపలాడే మువ్వన్నెల జెండా జాబిలి.
త్రిశూలధారి సిగలో మెరిసే జాబిలి
అందుకొనుము త్రిశూలంలా మా త్రివర్ణ జండా జాబిలి .
నిలపవయ్యా నీలోని విజ్ఞాన ఖనిజాలు మా మానసమున జాబిలి.
ధర్మాన్ని పరిరక్షించేలా ఎప్పుడు హిందూ దేశం విజయ పతాకములో నిలచేలాగా ఆశీర్వదించవయ్యా జాబిలి .
ఎన్నో తరాల కష్టానికి ఫలితంగా ఈ తరం వారి చంద్రయాన్ 3 నీ మేనుని ముద్దాడగ మా హృదయాలలో నీ వెన్నెల కురిసే .
నిన్ను తాకిన త్రివర్ణ పతాకం మా హృదయ స్పందనగా జాబిలి.
- ఆలపాటి సత్యవతి