మేరా భారత్ మహాన్...!!!
పసి మనస్సులు కట్టిన వెన్నెల
గొడుగుల క్రింద ఇసుక గూళ్ళకు అర్థం...
నేడు పగిలిన జ్ఞానమై ప్రపంచాన
పరుచుకొన్న వివరణలకు తామొక
వేదమని... చంద్రయాన్ గా
విజయకేతనం ఎగురవేసింది
మేరా భారత్ మహాన్...!!
దినమెంతటి విలువైనదో నని...
దిక్సూచీగా చదివిన చదువుల విజ్ఞానం
యోగ్యమై...కదిలిన ప్రవాహంగా
వ్యాపకమై సదస్సులతో కనబడే
వైజ్ఞానికాల అంకురార్పణలో దక్షిణ
ధృవానికి ద్వారాలు తెరిచాయి...
మనస్సున తేజం మట్టితో మమేకాలు
ఈ జీవితాలు...
కలిపిన బతుకుల కవనం ఐకమత్యమై
మిను వీదికి వారధికడుతు...
గడిచిన విశ్వాసం నేటికి కలకాదని...
సాధించే తపనకు గమ్యం సాంకేతిక
లోపం కాలేదని...
ఎంతటి దూరమైనా పిలిచిన బంధంగా
దరిజేరాల్సిందే...
గగనాన విహారం ఎన్నో మోహరింపులు
మహా కూటముల సంఘమమని
భయమెందుకు...నమ్మకం నడిపించిన
దారికి పిలిచిన జాబిలి చలువ
స్థానమైనిలిచింది...గెలిచిన ధ్యేయాన్ని
నిలిపిన జెండాగా నమస్కరించిన
వీరునికే సాధ్యమని...ఆ పరిచయం
కొత్త వసంతాలను పూయుటకు
వేదికలవుతున్నది...జై హింద్...
- దేరంగుల భైరవ