జీవనము - భవ్యచారు

Komentari · 245 Pogledi

- భవ్యచారు జీవనము జీవనము - భవ్యచారు

జీవనము

పట్టెడు మెతుకులు కోసం
ఎండనక వాననక రోడ్డు పై
తిరుగుతూ, చంకలో పిల్లతో
కారు అద్దాలు తుడుస్తూ
వారిచ్చిన పదో పరకో
తీసుకుని తన బిడ్డల
ఆకలి తీర్చేది ఓ తల్లి

సైకిల్ పై బుగ్గలు అమ్ముతూ
రోడ్లన్నీ తిరుగుతూ ఒక్కరైనా
కొనక పోతారా అనే ఆశ తో
గల్లి గల్లి తిరిగే ఒక తండ్రి

బుల్లెట్టు బండిని తుడుస్తూ
ఆ బండి ఎక్కలనే తపనను
కళ్ళలో దాచుకుని ఆ బండి నీ
మెరిసేలా చేసే కుర్రాడి కళ్ళలో
తెలిసేది జీవనము

- భవ్యచారు

Komentari