దేశభక్తి కలిపిన - చందమామ నిలిపిన సోదర బంధం - హరీశ్వర

Comments · 181 Views

దేశభక్తి కలిపిన - చందమామ నిలిపిన సోదర బంధం - హరీశ్వర

దేశభక్తి కలిపిన - చందమామ నిలిపిన సోదర బంధం

నా సోదరుడు "శశాంక్", పుట్టుకతో కాకుండా, దేశభక్తి తో నాకు సోదరుడైయ్యాడు. భారతీయ అంతరిక్ష ప్రోద్యోగికీ సంస్థ (IIST) అనే కాలేజీ లో తొలి పరిచయానికే నాతో హృదయ సంబంధం ఏర్పరుచుకుని హరిహరులు ప్రసాదించిన సోదరుడై, ఆ పై కాలేజీ స్వర్ణ పథకం గెలిచి, US లో NASA ద్వారా CalTech కాలేజీలో చేరి, అంతకు మించి, APJ అబ్దుల్ కలాం అవార్డు గెలిచి, అంతర్జాతీయ స్థాయిలో మన కాలర్ ఎగరేసి, ఆ తరువాత, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ లో చంద్రయాన్-3 లో, Control Dynamics Design Group, Mission Simulation Group లో కీలక భూమిక నిర్వర్తించి, over time duty కూడా చేసి, నిరంతర శ్రమ, దేశభక్తి తో చందమామ పైకి విక్రం రోవర్ ని ప్రపంచం లో మొట్టమొదటిసారి చంద్రుని దక్షిణ ధృవం లో నిలబెట్టి కీర్తి యశస్సు అందుకున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు.

ఆకాశమే హద్దుగా, అన్నీ మానసిక, ఆచరణాత్మకమైన, భారతీయ సరిహద్దులను చెరిపివేస్తూ, ఒకవైపు సాంకేతిక రంగములో, మరోవైపు అతను తన సొంత జీవితములో అధ్యాత్మిక "తత్వమసి" మరియు "అద్వైతం" సిద్ధాంతాలను నమ్మి, ఆచరించి, నిత్యం విజయాన్ని ముద్దాడుతూ, దేశం గర్వించేలా విజయాన్ని అందిస్తూ యువతకు స్పూర్తి గా నిలుస్తున్నాడు.

- హరీశ్వర

Comments