ఉనికి దృశ్యం కాదు...!!!- దేరంగుల భైరవ 

Comments · 214 Views

ఉనికి దృశ్యం కాదు...!!!- దేరంగుల భైరవ ఉనికి దృశ్యం కాదు

ఉనికి దృశ్యం కాదు...!!!

నిజంగా ఉండే స్థితిని నిరుత్సాహానికి
గురిచేయకు... నేర్పుకాని జీవితం నూర్పిళ్ళతో
సాధింపుబడదు కదిలే కాలానికి నడక
గడియారం ముళ్ళుకాదు అది మనోనేత్రంతో
గుర్తించే మానసిక స్పర్శకు ఉనికి మాత్రమే...

ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు ఏకాంతాలై...
కోరికలతో కాలరాయని కూర్పును
పొగడ్తలు కాని నిత్య మందిరపు నీడగా
నిలువని నీ మనస్సులోని భావన
నియమించుకొన్న స్థితిని పొందినా...
ఆగని కాలం ఎంతటి తీపి జ్ఞాపకమైనా
కదిలే యాపనే...

గారాబాల తూగుటుయ్యాలలో ఊగుతు
తలచిన మధికి కొలతబడే తర్ఫీదు లేక
వెదకే కారణానికి ఉపస్థితి తోడై...
దేహపు చిత్తం నిలవని అఘాతాలకు
దారని ఉనికిగా ఉద్ఘాటించినా...
చేతన కాలేని ఉనికి దృశ్యం కాదు...
ప్రత్యక్షానికి ప్రతి రూపంగా నిలువదు...

జరిగే చిత్రాలు ప్రత్యక్షాలై కనిపించినా
ఉనికిగా చెప్పే సమయానికి నీ కనుపాపల
చురుకుధనం దృశ్యంగా సాక్ష్యమై
సహకరించదు...నీవన్నది నమ్మకం కాదు...
ఇక్కడ శరీరము వేరు మనస్సు వేరు
ఆ రెండింటి కలయికతో నడిచే
జీవితం వేరు...

దీనిలో నీవు చూసినవి చూసేవన్ని
ప్రత్యేకించినవిగా చెప్పినా...
దాగని మనస్సులో తీపి జ్ఞాపకాలుగా
మథించినా ఒకనాటి కల్పనా చాతుర్యానికి
ప్రయానమే...గంభీర గమనింపును
ఒక్కసారిగా కదిలించు నిశ్శబ్ద తరంగాలు
వీచికలై ప్రేమతత్త్వాన్ని భోధించే తీపి
జ్ఞాపకాలుగా నిలిచిపోవాలని....

- దేరంగుల భైరవ 

Comments