జీవిత తిరోగమనం - పార్ట్ 4
అసలు ఏం అర్ధం కాదు ఆ క్షణం ఉదయ్ కి... తను ప్రేమించించిన అమ్మాయి మళ్ళీ మెసేజ్ చేయగానే మనసులో భద్రంగా ఉన్న తన స్థానం ఒక్కసారిగా మళ్ళీ తన జీవితంలోకీ వస్తాను ఏది ఏమైనా అనీ ఉప్పెనలా పడుతుంది...
ఉదయ్ ఏమైందిరా? ఎందుకు అలా అయిపోయావు అని తన తల్లి అడుగుతుంది ఉదయ్ ని. అమ్మా... సాత్వి మెసేజ్ చేసింది నేను తనకు దక్కకపోతే చనిపోతాను అంటోంది... నాకు సాత్వి కావాలి అమ్మ ప్లీజ్ తనతో నా జీవితం చాలా బాగుంటుంది అమ్మ... ఈ సంబంధం ఇక్కడితో ఆపేయ్ అమ్మ ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎలా ఆ అమ్మాయిని సంతోషంగా చేసుకోగలను...? ప్లీజ్ అమ్మ నా వల్ల కాదు నాకూ సాత్వి కావాలి...
రేయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా సంబంధం నిచ్చయం అయిందిరా... ఉదయ్ నా మాట విను.. సాత్విని మరిచిపో ఉదయ్.. అయినా మన భాష కూడా కాదు మనతో మనలో ఒకరిగా ఉండలేదు ఉదయ్ సాత్వి.. అని తన తల్లీ ఉదయ్ కి చెప్పగానే ఉదయ్ మరో మాట మాట్లాడకుండా తన తల్లి కాళ్ళు పట్టుకొని కళ్ల నీళ్లతో అమ్మా ప్లీజ్ నాకు సాత్వి కావాలి అని అనడంతో సరే ఉదయ్ నీ సంతోషం మాత్రమే నాకు కావాలి నీకు నీ మనసు ఎలా చెపితే అలానే చేయు.. వెళ్ళు... నీ ప్రేమను గెలిపించుకో అని ఉదయ్ తల్లీ చెప్పగానే ఉదయ్ మహారాష్ట్రకి నెక్స్ట్ డే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తాడు.
సాత్వి నాన్న కాళ్ళు ఉదయ్, సాత్వి పట్టుకొని చాలా ప్రాధేయపడుతారు మా ప్రేమను గెలిపించండి అని.. సాత్వి నాన్న నా కూతురు సంతోషం నాకు ముఖ్యం అని వాళ్ళ ప్రేమను అంగీకరించి పెళ్ళికి ఒప్పుకుంటాడు... కొన్ని కండిషన్స్ పెట్టి..
నా కూతరుకి మీ భాష రాదు.. మీ అమ్మ గారు మీ దగ్గర ఉండకూడదు.. మీరు బెంగుళూర్ లోనే ఉండాలి.. ఇక పెళ్లి కూడా మా పద్ధతి ప్రకారమే జరిపిస్తాం అని... అన్నిటికీ ఒప్పుకున్న ఉదయ్ ఒక్క తల్లి విషయం జీర్ణించుకోలేకపోతాడు. సాత్వి, ఉదయ్ భాదపడకు పెళ్లి అవ్వని అత్తయ్య గారిని మనతోనే ఉంటారు అక్కడికి మా నాన్న వచ్చి ఏం చూడరుగా... ముందు మన ప్రేమను గెలిపించు అని అడుగుతుంది... సరే అనీ ఉదయ్ సాత్వి తండ్రితో చెపుతాడు..
పెళ్లి అయ్యి తమ ప్రేమ గెలిపించుకున్నాం అనీ చాలా సంతోషం పడేలోపే అదేంటీ ఉదయ్ ఇక్కడ ఏసీ లేదా..? అనీ ప్రశ్నించిగానే ఏసీ ఎందుకు సాత్వి చల్లగానే ఉంది కదా అనీ ఉదయ్ అనగానే చూడూ ఉదయ్ నాకు కనీస సౌకర్యలు ఉండాలి.. అని తెగేసి చెపుతుంది సాత్వి ఉదయ్ తో..
అన్నట్లు ఉదయ్ మీ అమ్మగారికి నాకూ సెట్ అవ్వలేదు భాషతో చాలా ఇబ్బంది అవుతోంది.. నేనూ ఒకటి మాట్లాడితే తనకు ఇంకోలా అర్ధం అవుతోంది మీ అమ్మగారిని మీ విలెజ్ కి పంపించు.. మనమే వీలు ఉన్నపుడు వెళ్లి చూసి వద్దాము.. అన్నట్లు ఉదయ్ ఇక మన ఇంట్లో నాన్వెజ్ ఉండకూడదు.. నువ్వు కూడా ఇక పై తినకూడదు. నాకూ ఆంధ్ర వంటలు కూడా రావు ఉదయ్ నువ్వు కొంచెం అడ్జెస్ట్ అవ్వాలి అని మెల్లగా సాత్వి ఉదయ్ తో చెపుతుంది...
అసలు ఏం అర్ధం కాదు ఉదయ్ కి... ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కష్ట పెట్టకూడదు అని తనపై అతి ప్రేమ తల్లికి శాపంగా మారి మళ్ళీ ఒంటరిని చేసింది.. ఇటు తల్లికి అటు సాత్వికి మధ్య ఉదయ్ కి నరకం స్టార్ట్ అయ్యింది...
@@@@@@@@@@@@
చూసారా ప్రేమ దూరం ఉన్నంత వరకూ అమృతం అయింది ఉదయ్ విషయంలో.. దరికి చేరగానే అయోమయం... ఏంటో ఈ ప్రేమలు, పెళ్లిళ్లు తన కోసమే బ్రతికిన తన తల్లిని ఒంటరిని చేసి ఉదయ్ ఓడిపోయాడా? సాత్వి ప్రేమ పొంది గెలిచాడా? అనేవి ఇప్పటికీ ప్రశ్నలే....!
సమాప్తం
- కళ