దాంపత్య జీవితం - సాహు సంధ్య

Comments · 230 Views

దాంపత్య జీవితం - సాహు సంధ్య దాంపత్య జీవితం

దాంపత్య జీవితం

పంచభూతాలు సాక్షిగా
పచ్చని పందిరిలో కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తో
ఏడు అడుగులతో మొదలు పెట్టి
అంతులేని ఆనందాలతో
పెళ్లితో శ్రీకారం చుట్టి
వధూవరులు ఇరువురిని కలిపినటువంటి అమూల్యమైన బంధం ఈ మూడు ముళ్ళ బంధం
బంధం తో ఏకమైన జంట నూరేళ్ళ పంట గా
చిరకాలం చిరునవ్వులతో ప్రేమతో కట్టుకున్న కోవెల వంటి ఇంట్లో ఆనందం గా చేసే ఈ మూడు ముళ్ల బంధం
భార్య భర్తల మధ్య ఎన్ని కోపతాపాలు వచ్చిన ఏకం చేసిన శక్తి ఉన్నది మూడు ముళ్ళ బంధానికి
కానీ ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకు ,
ఆస్తి, అందం అనే విభేదాలు తో
నేడు రంగుల ప్రపంచం లో బంధం విలువ ఏంటో తెలుసుకోకుండా
భార్య భర్తల మూడు ముళ్ళ బంధం ను విడాకులు అనే కాగితాలు తో దూరం చేస్తున్నారు
కానీ పురాణాల సహితం దాంపత్య జీవితం గురించి గొప్పగా చెప్పబడింది
సీతారాముల కళ్యాణం జీవనం నీ ఆదర్శంగా చేసుకొని ఆనందం గా భార్యా భర్త లు ఇరువురు జీవనాన్ని కొనసాగించాలని మూడు ముళ్ల బంధం నీ గౌరవించాలి...

- సాహు సంధ్య

Comments