పొంగి పొరలే పాలసంద్రం...!!!
కలం గక్కిన కర్మఫలం
అక్షరమై బతుకుతుంది ఆమోదాలతో
ప్రమోదమై ఎన్నో గళాలు పాడిన పదాలు
ఏకమైనా సమరభేరిలో వినిపించే
ఆర్తనాధాలై అర్ధరాత్రి స్వాతంత్ర్యానికి
నియమమై ఉసిగొల్పిన
చైతన్యానికి సారథ్యమాయెను...
నిత్య మందిరానికి నీలో దేవుడైనా
అక్షరం ఆరని సూర్యోదయం...
చీకటిని మోసే రెక్కలతో అణగారిన
భావజాలానికి రూపమవుతు...
ఆపదలో అంకురార్పనలో సమయానికి
ధీటుగా పదానికి తర్ఫీదవుతు...
తేలిక పరిచే పద ప్రయోగమే అక్షరం...
పొదిగిన మకరందాలను తాగిన
జుమ్మనీ తుమ్మెదల రాగం అక్షరస్వరమే
ఆ పైరలపై వీచే చిరుగాలుల
చేష్టలు అక్షర విన్యాసమే...
వెన్నల వెలుగులలో కుదుటపడిన
మనస్సుతో తీసే వలపు గీతం
అక్షర సాహిత్యానికి ప్రపంచమే...
అక్షర బంధం మరుపురాని
సుగంధపు పరిమళం అణువణువున
సమితులతో పొంగి పొరలే పాలసంద్రం
ప్రకృతి రూపాలను పలకరిస్తు
ఋతువుల ప్రయాణానికి
సంకేతమవుతు...
మనిషి మనుగడకు దర్శనమై అందరి
హృదిలో నిలిచిన స్థానం అక్షరం...
దేరంగుల భైరవ (కర్నూలు)