స్మృతి పదనిసలు
విరబూసిన మల్లియలై పరిమళాలు వెదజల్లే
చిన్ననాటి జ్ఞాపకాలు పెదవినంటి పలకరించ
పిల్లలను కనునంటూ దాచుకున్ననెమలీకలు
ఇసుకగూళ్ళు కట్టుకున్న ఇంజనీర్లుమేమంటు
పట్టాలప్తె రుపాయిబిళ్ళ సాగతీత సాహసాలు
జామపళ్ళు దోచేటి తీపిగాయాల ముచ్చట్లు
అబ్బో ఎన్నోఎన్నెన్నో జ్ఞాపకాలసిరులంటే బాల్యమే
పెదవిపై నవ్వుపూయు మోముపై కాంతిమెరియు
కొంటెచూపు ప్రేమలేఖలు తావలచిన రంభంటు
కళాశాలకాదది స్నేహలతలు అల్లుకున్న పొదరిల్లు
ఇచ్చిపుచ్చుకునే పుస్తకాలే నాటిప్రేమరాయబారి
పెదవిచెప్పని కనులభాష ఊసులాడే మాటలేవో
మొదటి మాతృత్వపు అనుభవం మగనితోడు
పురిటినొప్పి చావుఅంచుదాకా పసిగుడ్డుతోపోయే
ఆహా అలనాటి జ్ఞాపకాలసిరులు అందించే ముదము
మది పున్నమికౌముదిగా సుమగంధమై అలరారు
- వింజరపు శిరీష