ఉచ్వాస నిచ్వాసలై...
దీర్ఘాయుష్మాన్భవ దీవెనలన్ని అందించే అందరికీ మారురూపమై..
ఒకే రుధిరపు దారలను పంచుకోని వాత్సల్యపు ప్రేమకు సాక్షిభూతమై...
తనువులు వేరైనా ఒకేహృదయ స్పందనను ఇముడ్చుకొనిరి రక్తసంబంధమై...
తుంటరి అల్లరితో చెల్లిలివై, అక్కగా మార్గదర్శివై మమతానురాగాలకు నెలవై...
నిరంతరం నిత్యచిగురులు తొడిగి చిరునవ్వులు ఒలికించే చెలిమి కి చిరునామా మన పేగు బందమై...
నిస్వార్థపు ప్రేమకు ప్రతీకగా నిలిచి ఒకరికి ఒకరై ఉచ్ఛ్వాస, నిచ్వాసలుగా కలకాలం వెంట నడుస్తుంటే...
ఎడబాటును దరికి చేరనీయకుండా ఎదనిండా అనురాగాన్ని నింపుకొని...
నేను నీకు రక్ష నీవు నాకు రక్ష అని ఇరువురు మాటకు ప్రతిబింబాలై
తోడు నిలుస్తూ....
ఆశలన్నీ అడుగంటిన వేళ నేనున్నానంటూ అడుగడుగునా తోడు నిలిచే బంధమే....
అమ్మలోని ప్రేమను నాన్నలోని బాధ్యతను పంచుకొని తోబుట్టువులై తోడు నిలిచే కడవరకు....
ఊపిరి ఉన్నంతవరకు చెరిగిపోదులే కలిసి పంచుకున్న ఊసులెన్నో...
ఎన్ని అపార్థాలు ఆస్తి కుమ్ములాటలు దరిచేరిన విడవకుమా ! వెళ్లి విరిసే జాజిపూల ప్రేమ మాధుర్యం....
- కొత్త ప్రియాంక (భానుప్రియ)