నిజంగా అదృష్టమంతులు - ప్రవీణ్

Comments · 257 Views

నిజంగా అదృష్టమంతులు - ప్రవీణ్

నిజంగా అదృష్టమంతులు


రాఖీ కి నా చెయ్యెప్పుడు ఖాళీ గానే ఉంటుంది..

రాఖీ అంటూ అందరు చేతి నిండా రాఖీలు కట్టుకుంటు కనబడితే..

బోసి గా ఉన్న నా చెయ్యిని చూసి నాకు ఓ చెల్లి ఉంటే ఎంత బాగుండో అనుకున్నా..

రాఖీ రోజు అన్నా చెల్లెల్ల బంధం గురించి టీవీ లో చూసిన, ఏదన్నా ప్రోగ్రామ్ చూసిన..

నాకో తోడ బుట్టిన తోడు ఉంటే కనీసం నన్ను తిట్టడానికి ఒక బంధం నాతో ఉండు కదా అనుకున్నా..

పెళ్లి అప్పగింతలల్ల అన్నా చెల్లెల్లు ఒకరిని ఒకరు విడిచి ఉండలేక ఏడుస్తుంటే నన్ను అలా ప్రేమించే ఒక చెల్లి ఉంటే చాలు కదా.. అనుకున్నా...

అమ్మ గా లాలించే మరో మాతృమూర్తే తోబుట్టువు..అక్క చెల్లెల్లు ఉన్నోళ్లు నిజంగా అదృష్టవంతులు...

- ప్రవీణ్

Comments