మానవీయత -వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

Comments · 193 Views

మానవీయత -వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

మానవీయత

" ఐఐటి కాన్పూర్లో" గోల్డ్ మెడల్ తో సత్కరించిన ,'ప్రభాకర్ రావు 'గారు అత్యంత తెలివితేటలు కలిగిన తెలుగు వాడు! అంచెలంచెలుగా, తన 'ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 'లో ఎన్నో ప్రయోగాలు చేసి, వాటిని మన సైనిక అవసరాల కు  తగ్గట్టుగా ఎలా అభివృద్ధి చేయాలి!? అన్న ఉద్దేశంతో 'పీహెచ్డీ 'కూడా చేసిన తర్వాత, ఎన్నో అధునాతన అభివృద్ధి పథకాలతో ,నూతన ప్రయోగాలతో ,అందరి మన్ననలను పొందాడు ప్రభాకర్ గారు.

ఆ తర్వాత' స్పేస్ సైన్స్ 'లో ఎన్నో కోర్సులు చేసి అత్యంత వేగంగా అంతరిక్ష శాస్త్రంలో 'ప్రావీణ్యం సంపాదించి, 'ఇస్రోలో  (ISRO)ప్రొఫెసర్ గా, జాయిన్ అయ్యి ,అక్కడకు వచ్చిన ఎంతోమంది విద్యార్థి ,విద్యార్థునులకు, అన్ని విధాల 'స్పేస్ షటిల్ 'తయారీ విధానాలను, 'పేలోడ్ 'ఎలా ఉంటే, మిగతా దేశాలు కూడా మన దేశ 'ఇస్రో ప్రాజెక్టులో 'పెట్టుబడులు పెట్టి ,ఆయా దేశాల 'టెలికమ్యూనికేషన్స్ ,వెదర్ రిపోర్ట్ ,లైవ్ కవరేజ్ ,వాటిమీద అనన్యసామాన్యమైన లెక్చర్ల తో దేశంలోనే అత్యంత మేధా వంతుడు అయిన సైంటిస్ట్ ప్రభాకర్ కు, ఆ సంవత్సరం జరగబోయే "శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రాం" కు అన్ని విధాల సహాయం అందించమ,ని 'డిప్యూటీ డైరెక్టర్ శాటిలైట్ ఆపరేషన్' శ్రీహరికోట, వద్ద పనిచేయుటకు 'కేంద్ర ప్రభుత్వం 'ఆ హోదా ఇచ్చింది.

' ISRO project'  లో సైంటిస్ట్ ప్రభాకర్ కు
ఉన్న ఒకే ఒక్క అధికారి, ఎంతో అనుభవం కలిగిన అత్యంత క్రమశిక్షణతో కూడిన 'డైరెక్టర్ ఆపరేషన్స్ 'ఒక్కరే .

ఏమండీ! కాస్త పిల్లలను బయటకు తీసుకు వెళ్ళండి, వాళ్ళ అసలు రెండు నెలలుగా మీ మొహం కూడా చూడలేదు, ఎందుకంటే, మీ ఉద్యోగంలో మీరు, ఎంతో కీలకమని మీరు ఇంటికి రావడమే లేదు, ఎప్పుడైనా వచ్చిన, ఒక్క రోజు ఉండి,, పిల్లల అచ్చట, ముచ్చట తీర్చకుండానే వెళ్లిపోతారు,

అని భార్య పార్వతి అనేసరికి, ఏం చేస్తం? ప్రభుత్వం నాకు ఎంతో బాధ్యతాయుతమైన పదవి అప్పగించింది, మరో నెల రోజుల్లో మా' స్పేస్ ప్రాజెక్ట్ 'అయిపోవాలి, మన రాకెట్ లో '14 దేశాల ఉపగ్రహాలను' పేలోడ్ గా తీసుకు వెళ్ళాలి,! దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు క్షణం తీరిక లేకుండా చేస్తున్నాo,

నేనే కాదు, మా ఆఫీస్ స్టాఫ్ 'డైరెక్టర్ గారి 'తో సహా కంటికి కునుకు లేకుండా పని చేస్తున్నాము, ఒక ప్రక్క లాంచింగ్ టైం! దగ్గర పడుతుండటం, మా డైరెక్టర్ గారు కూడా ఎన్నో విధాల అత్యుత్తమ ప్లాను లతో ఆటంకం కలగకుండా,

మా" సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం" లో నిర్విరామంగా పని చేస్తూ, మాకు తోడ్పడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా '600 కోట్ల బడ్జెట్'  ఈ ప్రాజెక్టుకు  ఇచ్చింది.

చూడు పార్వతి! దేశ భద్రత కోసం, వ్యవసాయాభివృద్ధి, కోసం అకాల భూకంపాలు, తుఫానులు ముందస్తు సమాచారం కోసం, మేము ఒక ఉపగ్రహాన్ని తయారుచేసి మన "GSLV-22 ind"rocket తయారు చేశాము.

నేను డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో' దేశ విదేశాల 14 ఉపగ్రహాలను 'కూడా అంతరిక్షంలోకి పంపించాలి, కనుక ఒక నెల పాటు నన్ను ఇబ్బంది పెట్టకు!! అంటూ భార్యను దగ్గరకు తీసుకుని, పిల్లలునీ ముద్దు పెట్టుకొని,' సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి 'హడావిడిగా వెళ్ళిపోయారు, నిజమైన దేశభక్తుడు సైంటిస్ట్ ప్రభాకర్ గారు.

ఇలా ఆఫీసులో రాత్రి ,పగలు '20 మంది సీనియర్ సైంటిస్ట్ 'లు అహోరాత్రులు శ్రమిస్తూ, డైరెక్టర్ గారి ఆజ్ఞలు తు.చ తప్పకుండా పాటిస్తూ, ఒకపక్క సమయం దగ్గర పడుతుంది, రాకెట్ లాంచ్  తేదీ ఖరారు అయిపోయింది, విదేశాల నుండి '14 ఉపగ్రహాలు 'వచ్చేసాయి, ఆయా దేశాల ఒత్తిడి ,భారతదేశ ప్రధానమంత్రి కార్యాలయం నుండి వస్తున్న ప్రెషర్ తట్టుకోలేక, డైరెక్టర్ గారు కూడా మా స్టాఫ్ తోనే ఉండి పోయి, అంత పెద్ద అధికారంలో ఉన్న' ఇస్రో డైరెక్టర్' గారు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు.

 

'అంతరిక్షంలోకి మొత్తం '12 నిమిషాల వ్యవధిలో' మనదేశ ఉపగ్రహం తో ,పాటు మిగతా '14 దేశాల ఉపగ్రహాలను 'కక్ష్యలోకి పంపించాలి, మన "పిఎస్ఎల్వి 'రాకెట్కు మూడు వరుసల భాగాలు ,ఒక్కొక్కటిగా విడిపోయి, చివరి  దశలో అంతరిక్షంలోకి మొత్తం ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం, ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం, మొత్తం ఉపగ్రహాలను' స్పేస్ లోకి 'ఏ వైఫల్యము లేకుండా పంపించడం అనేది చాలా కష్టతరమైన పని!! మన దేశ సాంకేతిక' పరువు ప్రతిష్టలు 'దీని మీద ఆధారపడి ఉన్నాయి,

 

అందువలన' డైరెక్టర్ గారు' కూడా  రాకెట్ మొదటి రెండు దశలు, ఒక్కొక్కటిగా విడిపోయి, కొన్ని 'వేల కిలోమీటర్ల 'తర్వాత మూడవ దశ విడిపోతు, అన్ని ఉపగ్రహాలను 'నిర్దిష్టమైన అంతరిక్ష కక్ష్యలోకి' పంపించడం, ఎంతో ప్రావీణ్యత, అనుభవం ఉన్న, "ప్రాజెక్ట డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ గారు "ఎన్నో కష్టాలను అధిగమించి, సైన్స్ లో ఉన్న అన్ని కోణాలలో ,ఎటువంటి  వైఫల్యం లేకుండా ,ప్రతి చిన్న పనిని నిశితంగా పరిశీలిస్తూ,' 48గంటల రాకెట్ లాంచింగ్,' కౌంట్ డౌన్ ప్రారంభించారు.

 

ఆ క్షణం నుంచి "సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం "ఆఫీసులోనే, హడావిడి మొదలు అయింది ,మొత్తము స్టాఫ్ అంతా' కంప్యూటర్ మానిటర్ ల 'ముందు కూర్చుని (PSLV-22 IND !)రాకెట్ లాంచింగ్ ప్యాడ్ లో' వార్మప్, అవుతూ, రాకెట్ చుట్టూ 'భారతీయ జెండా లు పెయింటింగ్ చేసి 'ఎంతో అందం గా ఆమార్చారు , ఎందుకంటే '1978 సంవత్సరం నుండి "pslv-c-52,Gslv-F10 "లాంటి సమర్థవంతమైన రాకెట్లను,

 

అంతరిక్షంలోకి పంపించి, భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు శాస్త్రవేత్తలు.! అప్పట్నుంచే. 'ISRO సంస్థ 'ఎంతో అభివృద్ధి చెందుతూ,  ఈనాడు '14 ఉపగ్రహాలను 'ఒకే రాకెట్లో అంతరిక్షంలోకి పంపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
,రాకెట్ మొదటి దశ మండించడం లో, ఎలాంటి ప్రాబ్లం లేదు, రెండవ దశ చిన్న మార్పులతో కరెక్ట్ గానే ఉంది, చివరిదశ సరైన సమయంలో, కొన్ని వేల కిలోమీటర్ల దగ్గర విడిపోతూ, అంతరిక్షంలోకి ఉపగ్రహాలను నిర్దిష్ట సమయానికి ప్రవేశపెట్టాలి !!ఈ రకంగా 'కంప్యూటర్ ప్రోగ్రామింగ్ 'చేసి అన్ని విధాల డైరెక్టర్ గారు తో ,సహా అందరూ ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ పరిశోధనలన్నీ ఒకరికొకరు చెప్పుకుంటూ, ఒక రకమైన 'అంతర్యుద్ధమే 'జరుగుతుంది ఆఫీసులో,

ప్రతి సైంటిస్ట్ ఏదో ఒక టైం చూసుకుని, ఒక గంట ఇంట్లో గడిపి ,మిగతా టైమంతా ఆఫీస్ లోనే ఉంటూ, రాకెట్ లాంచింగ్ ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నారు. కానీ ఒక్క ప్రభాకర్ గారికి ఎలాంటి సమయం దొరకక ,అత్యంత కీలకమైన పోస్ట్ కనక, అసలు ఇంటికి వెళ్లకుండా డైరెక్టర్ గారి సలహాలతో ఆఫీసులోనే గడపసాగాడు.

ఇక్కడ ప్రభాకర్ గారి ఇంట్లో భార్య పార్వతి ఇద్దరు పిల్లలతో సతమతమై పోతుంది, భర్త కి ఎన్ని సార్లు ఫోన్ చేసి ఏవండీ !!పిల్లలు బెంగ పెట్టుకున్నారు, మీరు వారిద్దరిని 'ఎగ్జిబిషన్ కు తీసుకెళ్తానని చెప్పారట! నన్ను బతక నివ్వటం లేదు, అని  భార్య చెప్పేసరికి, ఐ యాం సారీ !పార్వతి, పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది, పిల్లలకు నచ్చచెప్పు

ఒక వారం రోజుల్లో వస్తాను !అంటూ ఫోన్ పెట్టేసి, కన్నీళ్లు తుడుచుకుంటున్న డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ ను, చూసిన డైరెక్టర్ గారు సానుభూతితో భుజంతట్టి, మీరు రాకెట్ లాన్చ్ అయిన తర్వాత ,ఒక వారం పాటు సెలవు పెట్టి  భార్య,పిల్లలతో సహా ఎక్కడికైనా' వెకేషన్ కి 'వెళ్లి రండి! దానికి తగ్గ ఏర్పాట్లు అన్ని నేను చేస్తాను! ధైర్యంగా మన రాకెట్ లాంచింగ్ ప్రోగ్రాం ని సక్సెస్ఫుల్ చేయండి,

అని డైరెక్టర్ గారు అనేసరికి, అలాగే సార్! కౌంట్ డౌన్ మొదలైంది,   నేను దగ్గరుండి  పరిశీలించాలి వస్తాను సార్, థాంక్యూ!, అంటూ, హడావిడిగా ఆఫీస్ లోకి వెళ్ళిపోయారు ప్రభాకర్ గారు.

'ప్రాజెక్టు డైరెక్టర్ గారు'  రాకెట్ లాంచింగ్ ప్రోగ్రామ్కు సమయం దగ్గరవుతున్న వలన, ఆ వివరాలన్నీ 'విదేశీ ప్రతినిధులకు, 'ప్రధానమంత్రి గారు కార్యాలయమునకు, స్వయంగా ఫోన్ చేసి వివరాలు అందించారు.

డైరెక్టర్ గారు లంచ్ చేస్తున్న సమయంలో, మళ్ళీ ప్రభాకర్ గారి భార్య పార్వతి ఇంటి నుంచి, ఫోన్ వచ్చింది, హలో ఎవరు? అని అడిగేసరికి ,పార్వతి కంగారుగా సారీ సార్! మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, నేను ప్రభాకర్ గారి భార్య పార్వతి ని, వారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు,

మా చిన్న వాడు వాళ్ళ నాన్న గారి మీద బెంగ తో విపరీతమైన జ్వరం తో ఉండగా, నేను ఆసుపత్రిలో జాయిన్ చేశాను! 'నాన్నగారు, నాన్నగారు ' అంటూ ఒకటే కలవరింత, కాస్త మీరు దయచేసి ఆయనకు చెప్పండి !అంటూ గద్గద స్వరంతో మాట్లాడుతున్నా పార్వతిని, ఏం భయం లేదమ్మా! మీవారు చాలా కీలకమైన పనిలో ఉన్నారు,

నేను ఒక గంట ఖాళీగానే ఉన్నాను, నేను మీ తండ్రి లాంటి వాడిని ఇప్పుడే వస్తున్నాను, కంగారు పడకండి! అంటూ ఫోన్ పెట్టేసి, ఆగమేఘాల మీద డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ గారి ఇంటికి వచ్చి, అక్కడినుంచి ఆస్పత్రికి వెళ్లి, పార్వతి కుటుంబానికి అన్నివిధాల సాయం చేస్తూ, వారి పిల్లల్ని సముదాయించారు డైరెక్టర్ గారు.

పార్వతి, పిల్లలు  ఆరోగ్యంగా ఉన్న సమయంలో, ఇంటికి తీసుకు వచ్చి అన్ని విధాల ధైర్యం చెప్పి, ఆ మర్నాడు కూడా డైరెక్టర్ గారే స్వయంగా ఆ పిల్లల్ని  బయటకి తీసుకువెళ్లి చూడండి! పిల్లలు, నేను మీ 'తాతయ్య ను, 'మీ నాన్నగారు చాలా పనిలో ఉన్నారు ,రేపు వచ్చేస్తారు! అంటూ వారిని ఆనంద పరిచి, మళ్లీ ఎవరికి తెలియకుండానే ,

ఆఫీసుకు వచ్చి, తన పనిలో నిమగ్నమై పోయేవారు, "ద 'గ్రేట్  పిఎస్ఎల్వి-22
ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు."

ఆ మర్నాడు రాకెట్ లాంచింగ్ కౌంట్ డౌన్, చివరి రోజు అన్ని కీలక పరీక్షలు అయిన తర్వాత ,సరిగ్గా 10-10 నిమిషాలు కి "పిఎస్ఎల్వి 22 ind"రాకెట్ లాంచింగ్ అయ్యింది, టర్బైన్ నుంచి వచ్చేదట్టమైన పొగ తో, వాయువేగంతో జ్వల్లిస్తూ గగనం లోకి దూసుకుపోతున్న, మన దేశ రాకెట్ గతిని నిర్ధారిస్తూ, సైంటిస్టులు అందరూ కరతాళ ధ్వనులు చేసుకుంటూ, ఒకొక్క నిమిషం రాకెట్ స్పీడ్ ను పెంచుకుంటూ, మొదటి దశ విడిపోయే సరికి, అందరూ చప్పట్లు కొట్టు కుంటూ మళ్లీ తమ పనిలో మునిగిపో సాగారు.

 

అలాగే రెండో దశ కూడా రాకెట్ నుంచి విడిపోయినప్పుడు ,అత్యంత వేగంగా  గగనంలోకి దూసుకుపోతున్న రాకెట్ను మానిటర్ లో అనుక్షణం వీక్షించ సాగారు డైరెక్టర్ గారు, ప్రభాకర్ గారు. మొత్తం స్టాఫ్
విపరీతమైన ఉత్కంఠతో, దేవుని ప్రార్థిస్తూ "స్వామి !ఈ మూడవ దశ కూడా సఫలీకృతం అయ్యేటట్టు ఆశీర్వదించు,

మా దేశ సౌభాగ్యం కాపాడు స్వామి !అంటూ ప్రతి ఒక్కరూ తమ మనసులోని ప్రార్ధించు కుంటూ, ఉన్న సమయంలోనే మూడవ దశ కూడా నిర్దిష్ట కక్షలోకి వెళ్ళగానే అన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టి ,తనకు తానుగా PSLV-22 IND విడిపోయింది.

 

'ఆ క్షణం 'సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం' ఆఫీస్ మొత్తం, కరతాళధ్వనులతో మారుమోగిపోయింది, ప్రతి ఒక్కరూ షేక్ హ్యాండ్ లు ప0చుకుంటూ, ఒకరినొకరు కౌగిలించుకుంటూ, అభినందనలు తెలుపుకున్నారు.

ఆ మరు నిమిషంలో 'దేశ విదేశాల శుభాకాంక్షలు, మన 'రాష్ట్రపతి గారి, ప్రధాన మంత్రి గారి, శుభాకాంక్షలు అందడంతో, ఆనంద పారవశ్యంలో 'డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ గారు, ఆఫీస్ స్టాఫ్, పంచిన స్వీట్స్ ను ఒకరికొకరు తినిపించుకుంటు, అభినందించు కున్నారు.

ఆరోజు దేశానికే ఒక పర్వదినం, శాస్త్రవేత్తలందరూ ఎంతో సంతృప్తితో ఉపగ్రహాలు అన్నింటిని వాటిక అక్షరాల్లో స్థిరంగా ఉండేటట్టు చేసి, ఎంతో ఆనందంతో, విజయగర్వంతో హాయిగా నవ్వుకుంటూ, కాలం గడుపుతుంటే డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ రావు గారు మాత్రం తన భార్య పిల్లలు గుర్తుకు వచ్చి డైరెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని తన కారులో ఇంటికి బయలుదేరారు.

నెల రోజులు గడిచిన తర్వాత ఇంటికి వస్తుండగా ప్రభాకర్ గారి ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి , భార్య పార్వతి ఇద్దరు పిల్లలు తన మీద కోపంతో ఊగిపోతూ ఉంటారు, వారిని ఎలా సముదాయించాలో తెలియక కొంచెం అనుమానంగానే ఇంట్లోకి అడుగు పెట్టారు.

కానీ ఇంటి ముందు ఆ వీధి లోని వారందరూ స్వీట్లు పంచుకుంటూ బాణాసంచా కాల్చు కొంటు, తన కారు రాగానే పూలు జల్లుతూ భారత్ మాతాకీ జై జై ప్రభాకర్ గారికి జై జై అంటూమిన్నంటిన నినాదాలతో ఘన స్వాగతం చెబుతుఉండగా,

ఒకింత ఆశ్చర్యానికి ఆనందానికి లోనై ఇంట్లోకి రాగానే భార్య పార్వతి తనకు మంగళహారతి ఇచ్చి లోనికి ఆహ్వానించడం, పిల్లలు కూడా నాన్న గారు నాన్నగారు అంటూ కాళ్లకు చుట్టుకోవడం ప్రభాకర్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

ఆ రాత్రి కొంచెం హడావిడి తగ్గాక భార్య పార్వతిని దగ్గరకు తీసుకుంటూ ఏంటి నేనేదో కోపంతో ఉంటారు అని, పిల్లలు నాతో మాట్లాడరని, భావించాను, అయినా మీరందరూ ఇంత సంతోషంగా నన్ను ఆహ్వానించడం విచిత్రంగా ఉంది, చివరిసారిగా నెల కిందట మాట్లాడినప్పుడు ఎంతో కోపంగా ఉన్నావు అసలు కారణం ఏమిటి అని కొంటెగా అడిగేసరికి, భార్య పార్వతి చిరునవ్వుతో మరేం లేదండి, నా కన్నతండ్రి కూడా చేయని ఉపకారం మీ డైరెక్టర్ గారు చేశారు,

మన బాబు కి విపరీతమైన జ్వరం తో హాస్పటల్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేసినా మీరు తీయలేదు, ఆ సమయంలో  మీ డైరెక్టర్ గారు, ఫోన్ తీసి నాకు ఎంతో ధైర్యం చెప్పి, ఆరోజు బాబు ని ఆసుపత్రికి తీసుకు వెళ్లి స్వయంగా ట్రీట్మెంట్ చేయించారు .

పిల్లల్ని కూడా వీలున్నప్పుడల్లా వచ్చి నేను మీ తాతయ్యని, పదండి అంటూ బయటకు తీసుకు వెళ్లి ఎన్నో సరదాలు వాళ్లకు తీర్చారు.ఆ సమయంలో నాకు నా దేవుడు ఇచ్చిన సొంత నాన్నగారి లాగా సాయం చేశారు.

మీరు ఆ ప్రాజెక్టులో ఎంత కీలకమో మాకు తెలియజేశారు, అసలు మానవీయత మూర్తీభవించిన మీ డైరెక్టర్ గారు మహనీయులు వారికి నేను సదా రుణపడి ఉంటాను అంటూ భర్తకి చెప్తూ ఉండగానే, భార్య కళ్ళనీళ్ళు పెట్టుకొని భర్తను పెనవేసుకుపోయింది.

ఆ మాటలు వింటూనే ఆహా !నేను దేశభక్తి కోసం కుటుంబాన్ని వదిలేస్తే, మా' డైరెక్టర్ గారు' తనది కాని కుటుంబాన్ని చేరదీసి ,ఇటు మా అందరికీ  మార్గదర్శకుడిగా ఉంటూ, అంత పెద్ద
"PSLV-22 IND" rocket launching?✈️??✈️✈️ project" సమర్థవంతంగా నిర్వహించిన,
ISRO director మరి ఎవరో కాదు,

'మానవత్వం మూర్తిభవించిన "స్వర్గీయ శ్రీ డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు. ???"ఇది చరిత్రలో నిలిచిపోయే వాస్తవ కథ.

 


    

 

 

-వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

 

Comments